సరే అనండి!: రాయల టిపై ఆజాద్ పట్టు (పిక్చర్స్)

కేంద్రమంత్రి గులాం నబీ ఆజాత్ రాయల తెలంగాణపై మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం ముందు ఆజాద్ రాయల తెలంగాణ ప్రతిపాదించారట. దీనిని సాకారం చేసేందుకు ఆయన ఇరు ప్రాంతాల నేతలతో జోరుగా మంతనాలు జరుపుతున్నారట. ప్రధానంగా సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు నేతలకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి దీనికి అంగీకరించాలని నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట.

ఆజాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసికి ఫోన్ చేశారు. రాయల తెలంగాణ విషయమై ఫోన్ చేసినట్లుగా చెబుతున్నారు. మజ్లిస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. సమైక్యాన్ని కోరుకుంటోంది. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆజాద్ మజ్లిస్ అధినేతకు ఫోన్ చేయడం గమనార్హం.

రాయల తెలంగాణ ఇస్తే శ్రీశైలం డ్యాంతో సాగునీటి సమస్యలు తలెత్తవనే, మైరార్టీ జనాభా కూడా గుర్తించదగిన సంఖ్యలో ఉంటుందని ఆజాద్ చెప్పారట. ఇదే విషయాన్ని ఆజాద్ అధిష్టానానికి కూడా చెప్పారని సమాచారం. మొదట రాయల తెలంగాణ ప్రతిపాదన వినిపించింది. ఆ తర్వాత అది వెనక్కి పోయింది. అయితే శుక్రవారం భేటీలలో రాయల తెలంగాణ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

రాయల తెలంగాణపై ఆజాద్ పట్టుదల

రాయల తెలంగాణపై ఆజాద్ పట్టుదల

కేంద్రమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ మాజీ పర్యవేక్షకులు గులాం నబీ ఆజాద్ రాయల తెలంగాణ కోసం రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్యనేతలతో మంతనాలు సాగిస్తున్నారట. ప్రధానంగా సీమాంధ్ర నేతలకు ఫోన్లు చేసి అంగీకరించారని సూచిస్తున్నారట.

అసదుద్దీన్‌కు ఫోన్

అసదుద్దీన్‌కు ఫోన్

గులాం నబీ ఆజాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీసి ఫోన్ చేశారు. రాయల తెలంగాణ అంశం గురించి చర్చించేందుకే ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. అసద్ కూడా సమైక్యానికే తాము కట్టుబడి ఉన్నామని చెప్పినా.. విభజన అనివార్యమైతే రాయల తెలంగాణకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

రాయల తెలంగాణ

రాయల తెలంగాణ

విభజనపై జోరుగా ప్రచారం జరిగిన మొదట్లో రాయల తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ తర్వాత అది వెనక్కి పోయింది. శుక్రవారం నాటి భేటీలలో మళ్లీ రాయల తెలంగాణే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. రాయల తెలంగాణ ద్వారా ఎక్కువ సమస్యలు రావని ఆజాద్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జెసి దివాకర్ రెడ్డి

జెసి దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి ఆజాద్ ఫోన్ చేసి ఉంటారని అంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, దానికే తాను కట్టుబడి ఉన్నానని, విభజన అనివార్యమైతే సాగునీరు, ఇతర అంసాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణతో కలిసి ఉండటమే మేలని చెప్పారట. పలువురు ఇతర నేతలతోను ఆజాద్ మంతనాలు సాగించారని తెలుస్తోంది.

భాగస్వామిని కాలేను!

భాగస్వామిని కాలేను!

రాష్ట్ర విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాదల్చుకోలేదని కిరణ్ వారికి స్పష్టంగా చెప్పినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని కిరణ్ తన సన్నిహితుల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారట. సిఎం చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారని, విభజన వ్యవహారంలో భాగస్వామిని కాలేనని చెప్పారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+