వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత ఇమేజ్‌ కోసమే కిరణ్ రెడ్డి: బొత్స గుర్రు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సమస్యలపై కొంత మంది కీలకమైన నాయకులు ప్రతిస్పందించకుండా సొంత ఇమేజ్‌ను పెంచకోవడానికి ప్రయత్నిస్తున్నారని బొత్స సోమవారంనాడు వ్యాఖ్యానించారు.

కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించే బొత్స ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. సీమాంధ్రలో పార్టీని కాపాడాల్సిన బాధ్యత తనపైనా, ముఖ్యమంత్రిపైనా ఉందని ఆయన అన్నారు. అయితే, కొద్ది మంది నాయకులు పార్టీని కాపాడడానికి ప్రయత్నించే బదులు సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొత్త పార్టీ రావడానికి అవకాశాలున్నాయని బొత్స కూడా అంటున్నారు. కొత్త పార్టీని స్థాపించడానికి కొంత మంది ప్రయత్నాలు చేయడం సహజమని ఆయన అన్నారు. కొత్త పార్టీని పెట్టడానికి ప్రయత్నాలు జరిగితే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని ఆయన అన్నారు.

సిడబ్ల్యుసి నిర్ణయానికి కాంగ్రెసు నాయకులంతా కట్టుబడి ఉండాల్సిందేనని, అయితే తమ రాజీనామాల ద్వారా పార్టీ అధిష్టానంపై సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవడంలో తప్పులేదని ఆయన అన్నారు.

English summary

 PCC president Botsa Satyanarayana made it clear that both he and the Chief Minister Kiran kumar Reddy have the responsibility of saving the party in the Seemandhra region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X