హైడ్రామా: నాగబాబు ప్రకటన, సైన్‌కి పవన్ నో?

హీరో పవన్‌కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ లో చేరనున్నారని ప్రముఖంగా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఈ వార్త హాట్‌టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం చిరంజీవితో సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇలాంటి ప్రచారం పార్టీ ప్రతిష్టకు భంగకరమని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్‌సింగ్ కేంద్రమంత్రి చిరంజీవి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది.
మీడియాలో కథనాలు వస్తున్నా ఖండించకపోవడంతో దిగ్విజయ్ చిరంజీవిని ఒక దశలో మందలించినట్టు చెబుతున్నారు. దీంతో చిరంజీవి ఆఘమేఘాలమీద మరో సోదరుడు నాగబాబు చేత పత్రికా ప్రకటన ఇప్పించినట్టు సమాచారం. అయితే, ప్రకటనపై పవన్‌కళ్యాణ్ సంతకం చేసేందుకు నిరాకరించినట్టు తెలిసింది.
పత్రికలలో వచ్చిన వార్తలతో తనకు సంబంధం లేదని, అలాంటప్పుడు పత్రికా ప్రకటన విడుదల చేయడంలో అర్థం లేదని పవన్‌కళ్యాణ్ సంతకం చేయడానికి నిరాకరించినట్టు సమాచారం. మొత్తం మీద, ఈ వ్యవహారం మెగా కుటుంబంలోని విభేదాలను మరోసారి బయటపెట్టినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications