పిసిసి చీఫ్‌గా బొత్స అవుట్: కన్నా ఇన్?

Botsa Satyanarayana - Kanna Lakshminarayana
హైదరాబాద్: బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్ష పదవికి ముప్పు వచ్చినట్లు వినికిడి. మంత్రి కన్నా లక్ష్మినారాయణ అకస్మాత్తుగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కనిపించడంతో ఈ పుకార్లకు పునాదులు పడ్డాయి. తెలంగాణ అంశంపై సోనియా తన నివాసంలో సీనియర్లతో చర్చిస్తున్న సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణ సోనియా నివాసంలో ప్రత్యక్షం కావడం చర్చకు దారి తీసింది.
సోనియాగాంధీనే కన్నాను పిలిపించినట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కన్నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారని, తద్వారా రాష్ట్రంలో బలమైన కాపు సామాజికవర్గాన్ని తన వైపు పూర్తి స్థాయిలో మళ్లించుకోవడం ద్వారా ఎక్కువ స్థానాలు సాధించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉందని చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. ప్రస్తుత పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ సాంకేతికంగా బిసి వర్గానికి చెందిన తూర్పు కాపు. అయితే, మానసికంగా కాపు గానే భావిస్తున్నారు.

అయితే అసలు కాపులకు తూర్పు కాపులకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించిన నాయకత్వం, కోస్తాలో బలమైన కాపు సామాజికవర్గంలో ఇమేజ్‌ ఉన్న కన్నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వనుందన్న ప్రచారం కొద్దిరోజుల నుంచి వినిపిస్తోంది. రెడ్డి, క్రైస్తవ, దళిత క్రైస్తవ, మైనారిటీలో కొంతభాగం జగన్‌ పార్టీవైపు చూస్తున్న నేపథ్యంలో బలమైన కాపు వర్గాన్ని తమ వైపు ఆకర్షించాలన్న వ్యూహంలో భాగంగానే నాయకత్వం కన్నాను పిలిపించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అనేకసార్లు కన్నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఒకసారి చేజారిపోయింది. రెండుసార్లు ఎం.సత్యనారాయణరావు, బొత్స పిసిసి అధ్యక్షులైన సమయాల్లో కూడా కన్నా పేరు ముందు వరసలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోసమే ఆమె నివాసానికి వెళ్లానని, సోనియాను కలవలేదని కన్నా మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+