హరికృష్ణతో పురంధేశ్వరి 'సమైక్య' పోరు?

Purandheswari andHarikrishna
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సోదరుడు నందమూరి హరికృష్ణతో దగ్గుబాటి పురంధేశ్వరి చేతులు కలిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ నోట్‌ను మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దానిపై ఏ విధమైన సంప్రదింపులకు అవకాశం లేదని కూడా తేల్చి చెప్పారు.

తన పదవి గురించి కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనను సంప్రదించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేశారు. తన వద్దకు వచ్చే అధికారులతో ప్రోటోకాల్ ఏమీ పాటించనక్కర్లేదనీ, తాను మంత్రిగా కొనసాగడం లేదు కనుక ఇక ఎవరూ తన వద్దకు రావద్దని స్పష్టం చేశారు.

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం దాన్ని ఆమోదింపజేసుకున్న తొలి పార్లమెంటు సభ్యుడిగా నందమూరి హరికృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఆయన సమైక్యాంధ్ర కోసం రథయాత్ర చేపడుతారంటూ ప్రచారం సాగింది. అయితే, గత రెండు నెలలుగా కూడా మౌనంగానే ఉంటున్నారు.

మంత్రి పదవికి రాజీనామా చేసిన పురంధేశ్వరి దాదాపుగా కాంగ్రెసు పెద్దలకు దూరమైనట్లేనని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హరికృష్ణతో కలిసి ఆమె సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తారా అనేది తేలాల్సి ఉంది. అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ఇటు కాంగ్రెసును లక్ష్యం చేసుకుని ఎన్టీ రామారావు వారసులుగా ముందుకు రావడానికి వారు సిద్ధపడుతారా అనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+