సచిన్ అసంతృప్తి: ఔట్‌పై వివాదం, సీట్లు ఖాళీ

అంపైర్ నిర్ణయంతో సచిన్ టెండూల్కర్ కూడా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్ వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచులో షిల్లింగ్‌ఫోర్డు బౌలింగులో పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. సచిన్ జెర్సీ నెంబర్ కూడా పదే కావడం విశేషం.
గురువారం ఉదయం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కు దిగినప్పుడు ప్రేక్షకులు పలచగా ఉన్నారు. చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. ఇది కూడా సచిన్ మూడ్‌ను దెబ్బ తీసినట్లే ఉంది. మురళీ విజయ్ అవుటైన తర్వాత సచిన్ టెండూల్కర్ గురువారం ఉదయం 9 గంటల 39 నిమిషాలకు బ్యాటింగ్‌కు దిగాడు. ప్రేక్షకులు అతనికి కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు.
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో సచిన్ కోసం తొలి రోజు బుధవారం చేసిన హంగామా రెండో రోజు గురువారం కనిపించలేదు.












Click it and Unblock the Notifications