అటుదిటు!: దామోదర వద్ద సీమాంధ్ర, ఆనం వద్ద టి
సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సచివాలయంలో ఆసక్తికర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉద్యమం కారణంగా గత కొద్ది రోజులుగా సచివాలయంలో ఇరుప్రాంతాల ఉద్యోగులు ఆందోళనలు, ర్యాలీల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. సీమాంధ్ర ఉద్యోగులు విధులను బహిష్కరిస్తుండగా, తెలంగాణ ఉద్యోగులు ఓ వైపు నిరసన వ్యక్తం చేస్తూనే చకచకా పనులు చేసుకుంటు వెళ్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి దామోదర నర్సింహ చాంబరులో సీమాంధ్ర ఉద్యోగులు, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చాంబరులో తెలంగాణ ఉద్యోగులు ఉన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటూ విధులు బహిష్కరిస్తున్నందున దామోదర చాంబరు అంతా ఖాళీగా కనిపిస్తోంది.
అదే సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి చాంబరులో మాత్రం పనులు చకచకా సాగుతున్నాయట. ఆయన చాంబర్ వద్ద ఎలాంటి సమ్మె జాడలు కనిపించడం లేదు. ఇందుకు అక్కడ ఎక్కువ మంది తెలంగాణ ప్రాంత సిబ్బంది పని చేస్తుండటమే. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications