షర్మిల పాదయాత్ర: మౌనంగానే సాగమనీ..

తన యాత్రలో ఆమె అక్కడక్కడ ప్రజలను పలకరించారు, కానీ ప్రసంగాలు చేయలేదు. తమ కష్టాలు చెప్పుకుందామని రోడ్డుపైకి వచ్చిన ప్రజల మాటలను ఆమె విన్నారు. శుక్రవారంనాడు షర్మిల పాదయాత్రలో వరుపుల సుబ్బారావు, కొండమూరి వెంకటేశ్వరరావు, నరాల శ్రీనివాసరావు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.
శుక్రవారంనాటికి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 186వ రోజుకు చేరుకుంది. ఆమె పాదయాత్ర శుక్రవారం ఉదయం ప్రత్తిపాడు నియోజకవర్గం శాంతి ఆశ్రమం ఆర్చ్ నుంచి ప్రారంభమైంది. ఆమె 15.5 కిలోమీటర్లు నడిచి రాత్రి ఏడున్నర గంటలకు రైతులపూడి శివారులోని తన బసకు చేరుకున్నారు.
ఆమె యాత్ర శుక్రవారంనాటికి 2,472 కిలోమీటర్లు సాగింది. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆమె పాదయాత్రకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ తిరిగి కొనసాగిస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లా వరకు సాగుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications