వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్ పంచ్: టిఆర్ఎస్ నేతలకు టిడిపి గాలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇవ్వనున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో తమ పార్టీ తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిందని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ అభిప్రాయం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త జోష్ తీసుకు వచ్చింది. టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉందనే విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారు.

ఇప్పటికే ప్రజల్లో ఈ అంశం నానుతోంది. టిడిపి తెలంగాణకు అనుకూలంగా ఉందన్న సంకేతాలు వెళ్లడంతో చంద్రబాబు వ్యూహరచనలు సిద్ధం చేస్తున్నారట. ఇన్నాళ్లు టిడిపి నుండి తెరాస వైపుకు నేతలు వలస వెళ్లారు. ఇప్పుడు తెరాసపై బాబు ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారట. తెరాసలో పలువురికి గాలం వేసేందుకు ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కలిసి గ్రూప్ కూడా తయారయిందని చెవులు కొరుక్కుంటున్నారు.

తెలంగాణ వ్యతిరేకత కారణం వల్ల టిడిపి ఇమేజ్ కోల్పోయిందే తప్ప క్యాడర్ లేక కాదంటున్నారు. తెలంగాణలో టిడిపి క్యాడర్ బాగా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో క్యాడర్‌తో పాటు తెలంగాణవాదులు కూడా తమ వైపుకు వస్తారని తెలుగు తమ్ముళ్లు ధీమాతో ఉన్నారు. ఇదిగో తెలంగాణ అదిగో తెలంగాణ అనే కెసిఆర్ కంటే తెలంగాణకు సానుకూలమన్ని టిడిపి వైపు ప్రజలు, తెలంగాణవాదులు మొగ్గు చూపుతారని వారు భావిస్తున్నారట.

దీంతో ఆ పార్టీ నేతలకు గాలం వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. తెలంగాణ కోసమంటూ టిడిపిని వీడి తెరాసలోకి వెళ్లిన ముఖ్యనేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయట. కొందరి విషయంలో స్వయంగా బాబు కూడా జోక్యం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టిడిపి నుండి వెళ్లిన వారు కెసిఆర్ వైఖరితో ఇమడలేక పోతున్నారట. మరికొందరు తెలంగాణవాదం నేపథ్యంలో కెసిఆర్‌తో గిట్టనప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఉంటున్నారట.

అలాంటి వారంతా టిడిపి వైపు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారని తెలుగు తమ్ముళ్లలో ధీమా కనిపిస్తోంది. ఇన్నాళ్లు పార్టీ ఇబ్బందులు ఎదుర్కొందని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో గతంలో కంటే బలంగా మారుతుందని టిడిపి నేతలు చెబుతున్నారు. పార్టీని విడిచి వెళ్లిన వారు సొంతగూటికి వస్తారని కార్యకర్తలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే టిడిపి వలసల అస్త్రం ఎంత మేరకు పని చేస్తుందో చూడాలి.

English summary
It is said that Telugudesam Party Telangana leaders are inviting some TRS leaders in to TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X