అమెరికాకు ఆంధ్రా భయం: వెబ్‌సైట్లో తెలంగాణ

అదే సమయంలో మజ్లిస్ పార్టీ నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్‌ల అరెస్టులు. ఆంధ్రప్రదేశ్ ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలు ఏ పర్యవసానాలకు దారితీస్తాయో అనే ఆందోళనలో అమెరికా ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ పౌరులకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ అమెరికన్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్ ఇతర పట్టణాల్లో ఫిబ్రవరి 4వ తేదీ వరకూ చాలా అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రకటనలో హెచ్చరించింది.
ఓ నెలరోజుల వరకూ ఉద్యమం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగవచ్చునని, ఈ నేపథ్యంలో ఘర్షణలు జరిగే అవకాశాలున్నాయని తెలిపింది. వీటికి తోడు మతపరమైన పండగలు, జాతీయ దినోత్సవాలు జరగనున్నందున జనం భారీ సంఖ్యలో రోడ్లు ఎక్కవచ్చునని, ఈ పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అయి జనజీవనానికి ఆటంకం ఏర్పడవచ్చని పేర్కొంది.
మీడియా వ్యక్తులు, భద్రతా సిబ్బంది ఉన్న ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించాలని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తాజాగా అమెరికా కాన్సులేట్ తన వెబ్‌సైట్‌లో తెలంగాణ సమస్యను పతాక శీర్షికన ఉంచింది. ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరికే వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే అవకాశాలున్నాయని తెలిపింది.












Click it and Unblock the Notifications