జూ.ఎన్టీఆర్ నారా లోకేష్‌తో కలిసి పనిచేస్తారా?
హైదరాబాద్: మాస్ అపీల్ రాజకీయ పార్టీలకు ఇప్పుడు అవసరంగా మారాయి. ఈ స్థితిలో పార్టీకి దూరంగా ఉంటున్న నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సయోద్యకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరువురి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించడానికి తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఒకరు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడి తర్వాతి స్థానం నారా లోకేష్‌దే అనే పరిస్థితి వచ్చింది. బాలకృష్ణ షూటింగులో బిజీగా ఉండడంతో నారా లోకేష్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇదే సమయంలో పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. హరికృష్ణతో నారా లోకేష్ చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి.

జూనియర్ ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడితో పాటు బాలకృష్ణ చాలా ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తండ్రి, మామల ఆగ్రహాన్ని చల్లార్చి జూనియర్ ఎన్టీఆర్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు నారా లోకేష్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, నారా లోకేష్‌తో కలిసి పనిచేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అంగీకరిస్తారా అనేది ప్రశ్న.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడమే ధ్యేయంగా నారా లోకేష్ పనిచేస్తున్నారు. నారా లోకేష్ తన రాజకీయ లక్ష్యాన్ని 2019కి నిర్దేశించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రత్యక్ష రాజకీయాలకు ఆ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. అందువల్ల ఇరువురి మధ్య సయోధ్య ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.












Click it and Unblock the Notifications