విభజన: సీమాంధ్ర నేతలకు అసదుద్దీన్ షాక్

విభజన అనివార్యమైతే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి అంగీకరించాలని కొంత మంది సీమాంధ్ర నాయకులు అసదుద్దీన్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ తరహాలో కేంద్ర పాలిత ప్రాంతంగా గానీ, కేంద్ర అధికారాలతో ఉభయ రాష్ట్రాలకు శాశ్వత రాజధానిగా గానీ చేయడానికి అంగీకరించాలని వారు ఆయనను కోరినట్లు చెబుతున్నారు.
అయితే, హైదరాబాద్‌పై పట్టును కోల్పోవడానికి సిద్ధంగా లేని అసదుద్దీన్ ఓవైసీ అందుకు అంగీకరించలేదని అంటున్నారు. హైదరాబాద్ తెలంగాణలో మాత్రమే ఉండాలని, తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉండాలని ఆయన గట్టిగా చెబుతున్నారట. ఒకవేళ విభజన అంటూ జరిగితే హైదరాబాద్ తెలంగాణకే చెందాలని ఆయన అంటున్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ పదేళ్ల పాటు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉండాలని, ఆ తర్వాత అది పూర్తిగా తెలంగాణలో అంతర్భాగం కావాలని ఆయన చెబుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications