వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఎంపీలే గట్టిగా ఫైట్ చేయట్లేదన్న జాతీయ నేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలే గట్టిగా ఫైట్ చేయడం లేదని జెడి(యు) అధ్యక్షులు శరద్ యాదవ్ అభిప్రాయపడ్డారు! రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్ఎంయు నేతలు ఢిల్లీలో పలు పార్టీల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా వారు జెడి(యు) చీఫ్ శరద్ యాదవ్‌ను కలిశారు.

సమైక్యాంధ్ర ప్రదేశ్‌కు మద్దతివ్వాలని కోరారు. విభజనను తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన వారితో చెప్పారు. అంతేకాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా మీ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యులే గట్టిగా మాట్లాడటం లేదని, మీరు వారి పైన ఒత్తిడి తీసుకు రావాలని, తాము మద్దతుగా ఉంటామని సూచించారట కూడా.

ఎన్ఎంయు నేతలు సమైక్యాంధ్రకు మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో పలువురు ముఖ్యనేతలను కలుస్తున్నారు. ఈ రోజు వారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలువనున్నారు. సీమాంధ్ర ఉద్యమం గురించి వారు ఆయనకు వివరించనున్నారు. తాము కలిసిన నేతలకు వారు సీమాంధ్ర ఉద్యమం ఉధృతంగా ఉందని చెబుతున్నారు.

కాగా, రాష్ట్రానికి చెందిన సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి సభలో నిరసనలు తెలుపుతున్నారు. కాంగ్రెసు ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఆరోపించిన విషయం తెలిసిందే. మరోవైపు టిడిపి సభ్యులు సమైక్యాంధ్ర కోసం కాకుండా సీమాంధ్రకు న్యాయమంటూ డ్రామాలాడుతున్నారని కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆరోపిస్తున్నాయి.

English summary
JD(U) cheif Sharad Yadav told NMU leaders that they are supporting United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X