రెండు చోట్ల నరేంద్ర మోడీ: అలిగిన ఎల్‌కె అద్వానీ

Advani wants to contest from Bhopal, Narendra Modi gives him Gandhinagar
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాని అలక వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం తాను భోపాల్ నుండి పోటీ చేస్తానని అద్వానీ చెప్పగా... బిజెపి మాత్రం ఆయనకు మళ్లీ గాంధీ నగర్‌నే ఇచ్చింది. దీంతో ఆయన అలిగారు. పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండటంతో గాంధీనగర్ కంటే భోపాల్ మంచిదని భావించిన అద్వానీ, ఆ సీటును ఆశించారు. కానీ బిజెపి కోరిక తీరలేదు.

గాంధీ నగర్‌నుంచి పోటీ చేసేందుకు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ బిజెపి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తీసుకున్న నిర్ణయంపై పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ స్పందించ లేదు. గాంధీనగర్‌నుంచే పోటీ చేసేలా అద్వానీని ఒప్పించండం కోసం బిజెపి సీనియర్ నాయకులైన మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, కొంతమంది ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు అద్వానీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

బుధవారం రాత్రి 11 గంటల వరకు కూడా అద్వానీతో చర్చలు కొనసాగినప్పటికీ ఆయన మాత్రం గాంధీ నగర్‌నుంచి పోటీ చేయడంపై స్పష్టంగా ఏమీ చెప్పలేదని తెలిసింది. అద్వానీతో చర్చలు జరిపిన అనంతరం గడ్కరీ, సుష్మాస్వరాజ్‌లు బైట వేచి ఉన్న మీడియాతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. తనకు ఎట్టి పరిస్థితుల్లోను భోపాల్ సీటే కావాలని అద్వానీ పట్టుబడుతున్నారు.

కాగా, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ వారణాసి, వడోదర రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు. హేమమాలిని (మధుర), రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (జైపూర్), జగదాంబికా పాల్ (దొమారియాగంజ్)లు పోటీ చేయనున్నారు. రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన హేమమాలిని అభ్యర్థిత్వాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+