స్మృతి ఇరానీకి వర్సిటీలో చేదు అనుభవం

లక్నో: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) విద్యార్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆమె శనివారంనాడు వారణాసిలోని విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆగ్రహానికి గురయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసిలో ఆమెకు ఈ నిరసన ఎదురుకావడం విశేషం.
విద్యార్థులు స్మృతి ఇరానీని ఘెరావ్ చేశారు. కార్యక్రమానికి ఆలస్యంగా రావడం పట్ల వారు ఆగ్రహజ్వాలలు కురిపించారు. ట్రామా సెంటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. కోట్లాది రూపాయలతో ట్రామా సెంటర్‌ను ఏడాది క్రితం నిర్మించారు.
ఆ ప్రారంభానికి మానవ వనరుల శాఖ మంత్రి సమయం లభించకపోవడంతో ఆ జాప్యం జరిగింది. తనకు ఆహ్వానం అందలేదని చెబుతూ ఇరానీ రాలేదని సమాచారం. విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ లేకపోవడంతో దాని ప్రారంభంలో జాప్యం జరిగిందని ఇరానీ చెప్పారు.
జాప్యం తొలగిపోతుందని, సమస్యను పరిష్కరిస్తానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారు. ఇరానీ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితురాలైన సహాయకురాలనే విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications