షేమ్: అండర్ వియర్లలో త్రివర్ణ పతాకలు
హైదరాబాద్: పోలీసుల కళ్లు గప్పడానికి ఇద్దరు బిజెపి కార్యకర్తలు త్రివర్ణ పతాకను అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ వింమోచన దినోత్సవం సందర్భంగా పోలీసుల కళ్లు గప్పి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురేయాలనే అత్యుత్సాహంతో వారు ఈ అవమానకరమైన సంఘటనకు పాల్పడ్డారు.
తమ ప్యాంట్లలోంచి తీసి జాతీయ పతాకలను ఎగురేయడానికి ప్రయత్నించిన ఇద్దరు బిజెపి కార్యకర్తలను హైదరాబాద్ పశ్చిమ మండలం పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. జాతీయ పతాకను అవమానించినందుకు రాహుల్ శర్మ, హరీష్ కుమార్ అనే ఇద్దరు బిజెపి కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి బుధవారంనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురేయడానికి బిజెపికి పోలీసుల అనుమతి లభించకపోవడంతో బుధవారం ఆందోళనకు దిగారు.
బిజెపి నాయకులు బద్దం బాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. గోల్కొండ కోట వద్దకు చేరుకున్న బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మజ్లీస్ కారణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు రావడం లేదని బిజెపి నాయకులు విమర్శించారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications