పాదరక్షలతో: జగన్ తిరుమల టూర్ వివాదాస్పదం

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఆదివారం ఉదయం జగన్ శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన నిబంధనలు తుంగలో తొక్కారని, పాదరక్షలతోనే క్యూ కాంప్లెక్సులోకి వచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ పర్యటన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అత్యుత్సాహం చూపించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Controversy over Ys Jagan Tirumala tour

ఉదయం జగన్ రాక ఆలస్యం కావడంతో గంటసేపు బ్రేక్ దర్శనం నిలిపివేసి టిటిడి అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెబుతున్నారు. దీంతో భక్తులు లేక క్యూ లైన్లు వెలవెలబోయాయి. జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో వచ్చారు. భద్రతా సిబ్బంది వారించడంతో అక్కడే వదిలేశారు.

జగన్ సిబ్బంది కూడా జులుం ప్రదర్శించిందని విమర్శలు వస్తున్నాయి. జగన్‌తో పాటు దర్శనం కోసం విజిలెన్స్ సిబ్బందిని, టిటిడిని తోసుకొని వెళ్లడమే కాకుండా, మీడియాపై జులుం ప్రదర్శించారట. జగన్ సెక్యూరిటీ ఓ సమయంలో వాగ్వాదానికి కూడా దిగిందట. డ్రెస్ కోడ్ పాటించకుండా ఆలయంలోకి ప్రవేశించారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలోను జగన్ తిరుమల పర్యటన వివాదాస్పదమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+