అందుకే మోడీని అభినందించలేదన్న రాజపక్ష

Did not wish Modi on B’ day due to Xi’s visit: Rajapaksa
కొలంబో: భారత ప్రధాని నరేంద్ర మోడీని కావాలనే తాను అభినందించలేదని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స వ్యాఖ్యానించారు. బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం నాడు శ్రీలంక అధ్యక్షుడిని కలిసినపుడు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఐక్యరాజ్యసమితిలో జరిగే సమావేశంలో కలిసినపుడు తప్పకుండా మోడీని అభినందిస్తానని అన్నారు. మోడీ తన పుట్టిన రోజు నాడు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌తో బీజీగా ఉన్నారని, అలాంటి సమయంలో డిస్టర్బ్ చేయవద్దనే విష్ చేయలేదని రాజపక్ష బీజేపీ నేతలకు చెప్పారు. రాజపక్షతో జరిగిన 45 నిమిషాల సమావేశంలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మురళీధర రావు అన్నారు.

ప్రధానంగా తమిళజాతుల సమస్యపై మనసు విప్పి మాట్లాడారన్నారు. తమిళ్ నేషనల్ అలయన్స్‌తో చర్చలు తిరిగి ప్రారంభించాలని కోరినట్టు తెలిపారు. ప్రాంతీయ సాంస్కృతిక పర్యాటక ప్రోత్సాహక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని కోరామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+