సెల్‌ఫోన్ల చోరీ: వైద్యులు పురుషాంగం కోసేశారు

దాదాపు డజను మంది వైద్యులు 30 ఏళ్ల వ్యక్తిపై దాడి చేశారు. వెదురు బొంగులతో కొట్టారు. మొబైల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణపై డజన్ మంది జూనియర్ డాక్టర్లు ఈ పనికి పూనుకున్నారని ప్రాథమిక విచారణలో తేలినట్లు కోల్‌కతా డిప్యూటీ పోలీసు కమిషనర్ ధ్రువజ్యోతి డే చెప్పారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే నీల్‌రతన్ సర్కార్ వైద్య కళాశాల, ఆస్పత్రిలోని ఓ గదిలోకి బాధితుడిని లాక్కుని వెళ్లి ఓ స్తంభానికి క్టటేసి, దాడి చేశారు. దాంతో అతను మరణించాడు. కొంత మంది అతని ప్రైవేట్ శరీరభాగాలపై కూడా దారుణంగా కొట్టారు, కోతలు పెట్టారు. ఆస్పత్రి పక్కన పనిచేసే కూలీలు పోలీసులకు విషయం చెప్పారు.
పోలీసులు వచ్చేసరికి అతను రక్తం మడుగులో పడి ఉన్నాడు. సంఘటనా స్థలం నుంచి రేజర్ స్వాధీనం చేసుకున్నారు. అమానుషంగా అతన్ని కొట్టినట్లు అతని శరీరంపై ఉన్న గాయాలను చూస్తే అర్థమవుతుందని డే చెప్పారు. సంఘటనను దిగ్భ్రాంతికరమైందిగా పేర్కొంటూ రాష్ట్ర డిప్యూటీ ఆరోగ్య మంత్రి చంద్రిమా భట్టాచార్య విచారణకు ఆదేశించారు. ఇటువంటి అమానుషమైన సంఘటనలను సహించేది లేదని ఆమె అన్నారు. విచారణ నిమిత్తం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులు మాత్రం చేయలేదు.












Click it and Unblock the Notifications