వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు ప్రచారం: సంగీతారెడ్డి తోరణాలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చేవేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లోకసభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతా రెడ్డి తన భర్త విజయం కోసం ఆమె వినూత్న ప్రచారం సాగిస్తున్నారు. ఆమె అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ కూడా. పారిశ్రామికవేత్త అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

ఆమె ఇంటింటి తోరణం పేర సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించారు. ఆమె ప్రతి ఇంటికీ వెళ్లి తోరణాలు కడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తోరణాలు కడుతూ ప్రజలను పలకరిస్తున్నారు. చిరునవ్వుల తెలంగాణ అని తోరణాలపై రాసి ఉంది.

సంగీతారెడ్డి ఇటీవల వీధి కూడళ్ల సమావేశాలు కూడా నిర్వహించారు. వీధి కూడళ్లలో సభలు నిర్వహించి తన భర్తను గెలిపించాలని ప్రచారం సాగించారు. చేవెళ్ల లోకసభకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి. వీరేందర్ గౌడ్, కాంగ్రెసు అభ్యర్థి కార్తిక్ రెడ్డి కూడా రాజకీయాలకు కొత్తవారే.

గులాబీ తోరణం ఇలా..

గులాబీ తోరణం ఇలా..

చేవెళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి తన భర్త విజయం కోసం ఇంటింటికీ తోరణం కార్యక్రమం చేపట్టారు.

ఇంట్లోవారికి పలకరింపులు..

ఇంట్లోవారికి పలకరింపులు..

ఇళ్లకు తోరణాలు కట్టి ఇంట్లోవారిని సంగీతారెడ్డి ఇలా పలకరిస్తున్నారు. చిరునవ్వుల తెలంగాణ కోసం తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు.

నవ్వులు చిందిస్తూ...

నవ్వులు చిందిస్తూ...

సంగీతారెడ్డి తోరణాలు కట్ట సమయంలో చిరునవ్వులు చిందిస్తూ ఇంట్లోవారిని పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మామిడి తోరణాలు కూడా..

మామిడి తోరణాలు కూడా..

ఇళ్లకు మామిడి తోరణాలు కూడా కడుతూ గులాబీ తోరణాన్ని వేలాడదిస్తున్నారు. సంగీతారెడ్డి తన భర్త కొండా విశ్వేశ్వర రెడ్డి విజయం కోసం ఇలా..

English summary
Sangeetha Reddy, executive director of Appollo hospital and wife of Konda Vishweshar Reddy, Chevella MP contestant has fixed Thoranalu as a part of unique inti intiki thoranam campaign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X