మా అమ్మ ఓటు నేను వేయొచ్చా: మోహన్‌బాబు
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో ఓటు వేసే సమయంలో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు హంగామా చేశారు. తన అమ్మ వయో వృద్ధురాలని, ఆమె నడవలేని స్థితిలో ఉన్నారని ఆమె ఓటు తాను వేయొచ్చనా అని ఆయన పోలింగ్ నిర్వహణాధికారిని అడిగారు.
అలా వేయడానికి వీలు లేదని అధికారి సమాధానమిచ్చారు. ఆమెను పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చి, ఆమెను ఈవీఎం వద్దకు తీసుకెళ్లి, ఆమె చెప్పిన గుర్తుకు ఓటు వేయాల్సిందిగా అధికారి సూచించారు. దీంతో మోహన్ బాబు తన తల్లితో ఓటు వేయించారు.

సీమాంధ్రలో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మోహన్ బాబు తన సొంత ఊరు రంగంపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ బాబుతో పాటు కుమారుడు మంచు విష్ణు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మనకు నిరంతరం అందుబాటులో ఉండే నేతకు ఓటు వేయాలంటూ పలువురు మహిళా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత తన కుమారుడు మంచు విష్ణు, తల్లితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications