బిగ్ 4పై టీ గాయకుడి కారాలు మిరియాలు

టీవీ చర్చల్లో తరుచుగా కనిపించే కళాకారుల్లో రసమయి బాలకిషన్ ఒక్కరు. ఆయన తెలంగాణకోసం నృత్యరూపకాలు ప్రదర్శించారు. తెలంగాణ ఉద్యమ గేయాలు ఆలపిస్తూ వస్తున్నారు. కెమెరా ముందు అవకాశం దొరికితే తెలుగు సినిమా రంగంలో తెలంగాణవాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తుతూ ఉంటారు.
టీవీ చానెళ్లలో ఆయన రెండు తెలంగాణ గేయాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అంతేకాదు, వీర తెలంగాణ సినిమా తీసి చేతులు కూడా కాల్చుకున్నారు. తన సినిమాను తెలుగు సినీరంగంలో బిగ్ ఫోర్ దెబ్బ తీశారని ఆయన ఓ టీవీ చానెల్ చర్చాగోష్టిలో ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణవాళ్ల సత్తా ఏమిటో సినీ ప్రపంచానికి తెలుస్తుందని కూడా ఆయన అన్నారు. అయితే, నైజాంలో కూడా ఆయన వీర తెలంగాణ సినిమా ఎందుకు ఆడలేదనేది ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందేమోనని అనిపిస్తూ ఉంటుంది.












Click it and Unblock the Notifications