కెసిఆర్‌కు గుడి కట్టిన విద్యార్థులు (ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పట్ల విద్యార్థులు తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్వప్నాన్ని సాకారం చేసి, తొలి మంత్రివర్గ సమావేశంలోనే 44 అంశాలను ఆమోదించిన కెసిఆర్ పట్ల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ భక్తిని చాటుకున్నారు.
44 అంశాలను ఆమోదించడం ద్వారా ప్రజలకు కెసిఆర్ మేలు చేసే చర్యలు తీసుకున్నారని వారు కొనియాడారు. మంగళవారంనాడు యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద కెసిఆర్‌కు ఆలయం నిర్మించి, అందులో ఆయన ఫొటో పెట్టి పూజలు చేశారు

ప్రస్తుతం తాత్కాలిక ఆలయాన్ని నిర్మించామని, తర్వాత పక్కా ఆలయాన్ని నిర్మిస్తామని విద్యార్థులు చెప్పారు. ఇటువంటి పూజలే గతంలో కూడా కెసిఆర్‌కు చేసిన సందర్భాలున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ ఇప్పుడు దేవుడిగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

ప్రజల ఆకాంక్షలను కెసిఆర్ ఎలా సాకారం చేస్తారనేది ఇప్పుడు ముందున్న సమస్య. తెలంగాణ రాష్ట్రంలో సర్వం సుభిక్షంగా ఉంటుందని ఆయన చెబుతూ వచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం తన కలగా చెబుకుంటున్నారు. భవిష్యత్తు గానీ ఆయన బంగారు తెలంగాణ నిర్మాణం ఎలా ఉంటుందనేది చెప్పలేం.












Click it and Unblock the Notifications