ఐదేళ్ల తర్వాత నాక్కాదు: ఎమ్మెల్యే క్వార్టర్స్‌పై చెవిరెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి నివాసాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికారులు సోమవారం నాడు పరిశీలించారు. ఇంటి పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్లు చెవిరెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ అధికారులు ఎమ్మెల్యే నివాసాన్ని పరిశీలించారు. దీని పైన అసెంబ్లీ సభాపతికి అధికారులు నివేదికలు ఇవ్వనున్నారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ, ఆర్ అండ్ బీ అధికారులు ఈ నివాసాన్ని ఉదయం పరిశీలించారు.

తాను కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణల పైన చెవిరెడ్డి ఘాటుగా స్పందించారు. నేను భూమిని కబ్జా చేసినట్లుగా వస్తున్న ఆరోపణలు ఏమాత్రం సరికాదన్నారు. తాను తన సొంత నిధులతో క్వార్టర్స్‌ను ఆధునికీకరణ చేసుకుంటే తప్పేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ప్రభుత్వ నిధులతో క్వార్టర్‌ను ఆధునికీకరించడం లేదని చెప్పారు. అయిదేళ్ల తర్వాత ఈ క్వార్టర్ తనది కాదని తనకు తెలుసునని, అలాంటప్పుడు కబ్జా అనే విషయం ఎందుకు వస్తుందని అభిప్రాయపడ్డారు. కబ్జా చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.
కాగా, గతంలో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి.. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో తనకు కేటాయించిన క్వార్టర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు అది ఇతరులకు కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు తమకు కేటాయించిన క్వార్టర్స్‌ను అందంగా తీర్చిదిద్దుకోవడం మామూలే అంటున్నారు.












Click it and Unblock the Notifications