ఫ్యాన్స్ ఎన్నిసార్లు అడిగినా, బాలకృష్ణకు బాబు నో!
అమరావతి: అమరావతిలో శనివారం నాడు భూమిపూజ కార్యక్రమంలో హిందూపురం శాసనసభ్యుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణను మాట్లాడాలని అభిమానులు కోరారు. అయితే, అభిమానుల కోరిక నెరవేరలేదు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వారి కోరికను పట్టించుకోలేదు.
అంతకుముందు భూమిపూజ కోసం బాలకృష్ణ వచ్చినప్పుడు స్థానికులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భూమిపూజ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. అప్పటి నుండి పెద్ద ఎత్తున అభిమానులు బాలకృష్ణతో మాట్లాడాలించాలని కోరారు.
కానీ, చంద్రబాబు వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదని అంటున్నారు. వారు పదేపదే బాలకృష్ణతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు తన ప్రసంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, తాను మరియు ఎన్టీఆర్ హైదరాబాద్, తెలుగు ప్రజల కోసం చేసిన కృషి గురించి చెప్పినప్పుడు కూడా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున స్పందించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టం శనివారం నాడు జరిగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం గం.8.49 నిమిషాలకు రాజధాని కోసం భూమి పూజ చేశారు. భూమిపూజలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications