29 ఏళ్లుగా గాజుముక్కలే ఆయనకు ఆహారం
అమరావతి: 29 ఏళ్లుగా గాజు ముక్కలను తింటూ అరాయించుకుంటున్నాడు ఓ వ్యక్తి. ఆశ్చర్యంగా ఉంది కదా. గాజు ముక్కలను తినడం ఏంటని అనుకుంటున్నారా? కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మౌలాలి అలియాస్ గాజుల స్వామి 29 ఏళ్లుగా గాజు ముక్కలను తింటూ రికార్డు సొంతం చేసుకున్నాడు.
పండ్లు, చాక్లెట్లు, కూరగాయలు తిన్నంత సులువుగా గాజు ముక్కలను తినేస్తున్నాడు. అంతేకాదు తనకు సమీపంలో ఏదైనా గాజు ముక్క కనిపిస్తే చాలు అది తన పొట్టలోకి వేసుకోవాల్సిందే.

ఏదో పని నిమిత్తం శనివారం జమ్మలమడుగు నుంచి కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు వచ్చారు. అక్కడ పగలి ఉన్న ఒక గ్లాజు గ్లాసు, టీ గ్లాసు చూసిన ఆయన అమాంతం వాటిని పట పటా నమిలి మింగేశాడు.
గంటకు 3 డజన్ల టీ గ్లాసులు, 3 పెద్ద గ్లాసులు ట్యూబ్ లైట్ తినేస్తానని మౌలాలి తెలిపాడు. అంతేకాదు గంటన్నరలో ఏకంగా ఒక ఆటో అద్దాన్నే అవలీలగా తినేస్తానని ఎంతో గర్వంగా చెబుతున్నాడు ఈ గ్లాజు మనిషి మౌలాలి.












Click it and Unblock the Notifications