ఎర్ర చీమలు బ్రేకు వైర్లని కొరికాయి, రైలు ఆగిపోయింది

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై లోకల్ రైలు బ్రేకు వైర్లను ఎర్ర చీమలు కొరికి వేసిన సంఘటన... విచారణలో వెలుగు చూసింది. ఎర్ర చీమల వల్ల లోకల్ రైలుకు చిక్కులు వస్తున్నాయి. ఓ రైలులో ప్రధాన ఈపీ బ్రేకుతో అనుసంధానమై ఉండే ప్రైమరీ బ్రేక్ వైర్లను అవి కొరికేశాయి.

ఈ ఘటన మంగళవారం నాడు జరిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వేకు చెందిన అధికారి వెల్లడించారు. ప్రైమరీ బ్రేక్ వైర్లు విడివడి ఉండటాన్ని రైలు సిబ్బంది గమనించారు. దీని ప్రభావం వల్ల ఈపీ బ్రేక్‌లు సరిగా పని చేయలేదు. దీంతో అత్యవసర (ఎమర్జెన్సీ) బ్రేకులను ఉపయోగించి రైలును ఆపేశారు.

Mumbai: Local train brakes failed due to red ants, probe reveals

ఆ సమయంలో ప్రయాణీకులు లేరు. దీంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదానికి గల కారణాన్ని ఎక్సామినేషన్ కోసం ఆ లోకల్ రైలును కుర్లా కార్ షెడ్‌కు పంపించారు. అక్కడే.. ఎర్ర చీమల వల్ల బ్రేకు వైర్లు ఫెయిల్ అయ్యాయని తేలింది.

ఆ లోకల్ రైలు.. కళ్యాణ్ నుంచి వచ్చింది. మంగళవారం ఉదయం గం.11.47 నిమిషాలకు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు వచ్చింది. ఆ తర్వాత మాతుంగ స్టేషన్ చేరాక బ్రేకులలో సమస్య వచ్చింది. అత్యవసర బ్రేకులను ఉపయోగించి ఆపారు. కుర్లా షెడ్ తరలించారు. అక్కడ తెరిచి చూడగా... ఎర్ర చీమలు కనిపించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+