వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చిన పురుషాంగంతో తండ్రి కాబోతున్న వ్యక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచంలోనే తొలిసారిగా పురుషాంగం మార్పిడి చేయించుకున్న వ్యక్తి తండ్రి కాబోతున్నాడు. అతని స్నేహితురాలు గర్భం దాల్చింది. నిరుడు డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌లోని స్టెల్లెన్ బోష్చ్ విశ్వవిద్యాలయం నిపుణులు ఈ పురుషాంగం మార్పిడి చేశారు. పురుషాంగం మార్పిడి చేయించుకున్న వ్యక్తి తండ్రి కాబోతున్నట్లు వారు ప్రకటించారు.

గర్భధారణ జరగడంతో అవయవం పనిచేస్తోందని నిర్ధారణ అయిందని, మార్పిడి ప్రక్రియ విజయవంతమైందని ప్రొఫెసర్ ఆండ్రీ వాండర్ మెర్వ్ చెప్పారు. సున్తీ ప్రక్రియ వికటించడంతో 21 ఏళ్ల వ్యక్తి సెంటీ మీటర్ మినహా మిగతా పురుషాంగాన్నంతా కోల్పోయాడు.

Penis transplant patient to become a father

ఆ స్థితిలో మరణశయ్యపై కొనఊపిరితో ఉన్న వ్యక్తి పురుషాంగాన్ని తీసుకుని శస్త్రచికిత్స ద్వారా ఆ వ్యక్తికి అతికించారు. మార్పిడి చేసిన ఐదు వారాల నుంచి అతను లైంగిక జీవితాన్ని కొనసాగించినట్లు వైద్యులు తెలిపారు. అంగస్తంభనలు, స్ఖలనాలు సక్రమంగానే జరిగాయని, భాగస్వామితో లైంగిక జీవితాన్ని బాగానే గడిపాడని ప్రొఫెసర్ ఫాంక్ గ్రేవ్ చెప్పారు.

పురుషాంగం మార్పిడి చేయించుకున్న వ్యక్తి గర్వంగా ఫీలవుతున్నాడని, కాస్తా సిగ్గు కూడా పడుతున్నాడని ఆండ్రే వాన్ డేర్ మెర్వే చెప్పారు. 18 ఏళ్ల ప్రాయంలో ఆ వ్యక్తి పురుషాంగం తెగిపోయి గాంగ్రీన్ వచ్చిందని, ఆ ప్రాయంలో అతను లైంగిక చురుగ్గా ఉన్నాడని వైద్య నిపుణలు చెప్పారు.

English summary
A South African man who had the world’s first successful penis transplant is to become a father less than a year after the breakthrough surgery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X