ఏం జరుగుతోంది, డిఎంకె పార్టీ నాయకుల అత్యవసర సమావేశం, గౌతమిపై అన్నాడిఎంకె ఎదురుదాడి
అన్నాడిఎంకె పార్టీని ఇబ్బందిపెట్టేందుకు సాగుతున్న కుట్రలో భాగంగా జయలలిత చికిత్సపై సినీ నటి గౌతమి ఆరోపణలు చేశారని అన్నా డిఎంకె పార్టీ నాయకులు ఎదురుదాడికి దిగారు. జయకు జరిగిన చికిత్స విషయం అందరికీ తెలిస
చెన్నై : ఆసుపత్రిలో జయలలిత చికిత్స తీసుకొంటున్న సమయంలో చోటుచేసుకొన్న పరిణామాలపై సినీ నటి గౌతమి అనుమానాలను వ్యక్తం చేశారు. జయ మరణంపై తనకు అనుమానాలున్నాయని, ఈ విషయంలో విచారణ జరిపించాలని ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. అయితే ఈ లేఖ తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిసోంది. అన్నా డిఎంకె పార్టీ నాయకులు గౌతమిపై నిప్పులు చెరిగారు. గౌతమి చేసిన ఆరోపణలను అన్నాడిఎంకె నేతలు తిప్పికొట్టారు.

గౌతమికి అన్నా డిఎంకె కౌంటర్
జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నట్టు సినీ నటి గౌతమి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై అన్నాడిఎంకె వర్గాల్లో అసహానాన్ని పెంచింది. ఈ లేఖపై అన్నాడిఎంకె విరుచుకుపడింది. అయితే పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్రకు గౌతమి సహకరిస్తున్నారని అన్నాడిఎంకె నేతలు గౌతమిపై ఆరోపణలను గుప్పించారు. జయలలితకు ప్రపంచ ప్రసిద్దిగాంచిన వైద్యులు చికిత్సను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు గౌతమికి సూచించారు.

కుట్రదారులకు గౌతమి సహకారం!
జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నట్టు సినీ నటి గౌతమి ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై అన్నాడిఎంకె వర్గాల్లో అసహానాన్ని పెంచింది. ఈ లేఖపై అన్నాడిఎంకె విరుచుకుపడింది. అయితే పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్రకు గౌతమి సహకరిస్తున్నారని అన్నాడిఎంకె నేతలు గౌతమిపై ఆరోపణలను గుప్పించారు. జయలలితకు ప్రపంచ ప్రసిద్దిగాంచిన వైద్యులు చికిత్సను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు గౌతమికి సూచించారు.

పావుగా మారుతున్న గౌతమి
పార్టీలో ఇబ్బందికర పరిస్థితులను తెచ్చేందుకు సాగుతన్న కుట్రల్లో గౌతమి పావుగా మారారనే అనుమానాన్ని అన్నా డిఎంకె నేతలు వ్యక్తం చేశారు. గౌతమి ప్రశ్నలు అన్నాడిఎంకె పార్టీని ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ప్రశ్నలతో ప్రజల్లో వచ్చే అనుమానాలను నివృత్తి చేయాలని గౌతమి కోరారు.అయితే ఈ పరిణామాలు పార్టీకి నష్టం కల్గించేవిధంగా ఉన్నాయని భావించిన పార్టీ నాయకులు గౌతమిపై ఎదురుదాడికి దిగారు. పలువురు రాజకీయ నాయకులు, విఐపిలు, కేంద్ర, రాష్ట్రమంత్రులు జయను పరామర్శించేందుకు వచ్చి ఆమె ఆరోగ్యంగా ఉన్న విషయాన్ని మీడియాతో పంచుకొన్న విషయాన్ని అన్నాడిఎంకె నేతలు ప్రస్తావిస్తున్నారు. పార్టీలో ఇబ్బందికర పరిస్థితులను తెచ్చేందుకు సాగుతున్న కుట్రలకు గౌతమి సహకారం అందిస్తోందనే అనుమానాలను ఆ పార్టీవర్గాలు వ్యక్తం చేశాయి.

గౌతమి ఆరోఫణలను సమర్థించిన మాజీ ఎంఏల్ఏ శేఖర్
గౌతమి చేసిన ఆరోపణలకు కూడ కొంత మద్దతు లభిస్తోంది. జయలలిత చికిత్స విషయంలో అనేక అనుమానాలు ఉన్నట్టు మాజీ ఎంఏల్ఏ ఎస్ వి శేఖర్ అభిప్రాయపడ్డారు. అన్నా డిఎంకె పార్టీ నాయకులు ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తే, మాజీ ఎంఏల్ఏ మాత్రం ఈ ఆరోపణలను సమర్థించాడు. ప్రజల్లో ఉన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన గుర్తు చేశారు. ఎస్ వి శేఖర్ ప్రకటన గౌతమి ప్రకటనలకు కొంత బలాన్ని ఇచ్చింది.

కరుణతో రజనీ కాంత్ సమావేశం వెనుక
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని శనివారం నాడు సినీనటుడు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సమావేశం కావడం రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. జయలలిత పార్థీవ దేహం వద్ద రజనీ కాంత్ కన్నీరు పెట్టుకొన్నారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్సపొంది ఇంటికి చేరుకొన్న కరుణానిధిని రజనీ పరామర్శించేందుకు వెళ్ళారని డిఎంకె వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సమావేశం కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.మరో వైపు తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకుగాను డిఎంకె పార్టీకి చెందిన ఎంపి, ఎంఏల్ఏలతో డిసెంబర్ 20వ, తేదిన సమావేశం కానుంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

రాజకీయ వాతావరణం వేడేక్కింది
జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయవాతావరణం వేడెక్కింది. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో చోటుచేసుకొన్న పరిణామాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను తీర్చాలని గౌతమి ప్రధానమంత్రికి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అధికార పార్టీ అన్నా డిఎంకె, విపక్ష డిఎంకె, కాంగ్రెస్ కూటమి మద్య సుమారు 20 మంది ఎంఏల్ఏల తేడా మాత్రమే ఉంది.అయితే అన్నాడిఎంకె ను చీల్చేందుకు కుట్రసాగుతోందనే ప్రచారం సాగుతోంది. గౌతమి చేసిన ఆరోపణలను కుట్రదారులకు సహాకారం అందించేలా ఉన్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు.ఈ ఆరోపణలను చూస్తే అన్నాడిఎంకెలో కొంత సంక్షోభవాతావరణం కన్పిస్తోంది. ఈ పరిస్థితులను చక్కదిద్దే నాయకత్వం ప్రస్తుతం ఆ పార్టీకి కావాల్సి ఉంది. అన్నాడిఎంకె వ్యవహారాలను తమిళనాడులోని అన్ని రాజకీయపార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. బిజెపి నాయకత్వం కూడ ఈ వ్యవహారాలప ఆచితూచి అడుగులేస్తోంది. విపక్ష డిఎంకె కూడ అన్ని పరిణామాలను గమనిస్తోంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications