మళ్లీ కలతలు: అనుష్క శర్మతో విరాట్ బ్రేకప్?
ముంబై: సెలిబ్రిటీల ప్రేమాయణాలు ఎప్పుడు మొగ్గ తొడుగుతాయో, ఎప్పుడు విడిపోతాయో చెప్పడం సాధ్యం కాదు. ఇటీవలి కాలం దాకా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి, బాలీవుడ్ తార అనుష్క శర్మకు మధ్య మళ్లీ కలతలు చోటు చేసుకున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
విరాట్ కోహ్లీ ఎక్కువ సాన్నిహిత్యాన్ని కోరుతుండడంతో, ఎక్కువగా తనతో కలిసి ఉండాలని ఆశిస్తుండడంతో అనుష్క శర్మ సినీ షెడ్యూల్స్‌కు సమస్య ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా ప్రమోషన్ కోసం అనుష్క శర్మ రణబీర్ కపూర్, ఫవాద్ ఖాన్‌లతో పర్యటనలు చేస్తుండడం విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని చెబుతున్నారు.

ఇరువురి మధ్య విభేదాలు బ్రేకప్ దాకా వచ్చాయని అంటున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరు ప్రేమలో వున్నారు. భారత మ్యాచ్‌ల సందర్భంలో ఈ జంట అనేకమార్లు స్టేడియాల్లో కలిసి దర్శనమిచ్చారు. వరుస సినిమా షూటింగ్‌ల కారణంగా విరాట్‌తో గడిపేందుకు అనుష్కశర్మ తగిన సమయాన్ని కేటాయించలేకపోతోందని, ఈ విషయంలో విరాట్ అసంతృప్తిగా వున్నారని అంటున్నారు.
నిలో పాటు సహచర బాలీవుడ్ నటులతో అనుష్కశర్మ సన్నిహితంగా వుండటం విరాట్‌కు నచ్చలేదని, ఆయన అభద్రతా వున్నారని చెబుతున్నారు. అనుష్కశర్మ నటించే సినిమా సెట్స్‌కు తరచూ విచ్చేసే విరాట్‌కోహ్లి ఇటీవల కాలంలో షూటింగ్‌లకు చాలా దూరంగా వుంటున్నారని బాలీవుడ్ అంటున్నాయి.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications