హైదరాబాద్‌లోని బాబు ఇల్లు ఇక ఏపీ క్యాంప్ ఆఫీస్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఏపీ క్యాంప్ కార్యాలయంగా మారుతోంది. హైదరాబాదులోని మదీనగూడలోని బాబు ఇల్లు క్యాంప్ కార్యాలయం కానుంది.
గురువారం నాడు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని మదీనగూడలోని చంద్రబాబు ఇంటిని క్యాంప్ రెసిడెన్స్‌గా ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తన ఇంటిని అధికారిక కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు.

అదే సమయంలో హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోని క్యాంప్ కార్యాలయం పైన ఆర్డర్‌లో ఎలాంటి ప్రస్తావన లేదు. విభజన నేపథ్యంలో.. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో చంద్రబాబుకు దీనిని అధికారిక కార్యాలయంగా ఇచ్చారు. అయితే, చంద్రబాబు విజయవాడకు వెళ్లిన తర్వాత లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌ను ఉపయోగించడం లేదనే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications