కేటీఆర్ ఆదేశించారు.. అధికారులు ఫాలో అయ్యారు..

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్ : విషయమేదైనా సరే.. ఆచరణలో పెట్టాలంటే ఆదేశాలిచ్చే నేతలే ముందు ఆ పనికి పూనుకోవాలి. రూల్ ఈజ్ రూల్.. అన్నట్టుగా వ్యవహరిస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే తరహాలో విధానాన్ని అనుసరిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పై పత్యేక ఫోకస్ పెట్టిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. నగర సమస్యలపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సమీక్షలు నిర్వహించడం.. పనితీరులో ఉదాసీనతకు తావు ఇవ్వవద్దంటూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేస్తుండడంతో.. అధికారులు వెంటనే రంగంలోకి దిగుతున్నారు.

GHMC officials followed KTR Orders

తాజాగా.. నగరంలో విచ్చలవిడిగా ఏర్పాటైన అక్రమ హోర్డింగ్స్ పై జీహెచ్ఎంసీ అధికారులు సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్, అనుమతి లేకపోతే ఆఖరికి తన 'బర్త్ డే హోర్డింగ్స్' అయినా సరే తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అనుమతి లేకపోతే.. నా హోర్డింగ్స్ అయినా తొలగించాల్సిందే! : కేటీఆర్

అయితే కేటీఆర్ ఆదేశాలను వెంటనే ఆచరణలో పెట్టిన అధికారులు.. నగరంలోని పలు అక్రమ హోర్డింగ్స్ తో పాటు కేటీఆర్ బర్త్ డే హోర్డింగ్స్ కూడా తొలగించేశారు. స్వయంగా కేటీఆరే ఆదేశాలు ఇవ్వడంతో.. కేటీఆర్ బర్త్ డే సందర్బంగా నగరంలో పలువురు నేతలు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను అధికారులు తొలగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
GHMC officials followed KTR Orders. They removed KTR birthday hordings in city which are arranged by some of the influenced politicians

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి