రూ. లక్షన్నర కుక్కను గోనె సంచిలో పడేశారు!

హైదరాబాద్: నగరంలోని నెక్లెస్‌రోడ్ రైల్వే ట్రాక్ వద్ద ఓ గోనెసంచి కనిపించింది. దీంతో స్థానికులు ఆ గోనె సంచిలో మృతదేహం ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

పంజాగుట్ట పోలీసులు బాంబు డిస్పోజల్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం సిబ్బందితో అక్కడికి చేరుకుని గోనె సంచి విప్పి చూశారు. కాగా, అందులో ఓ కుక్క మృతదేహం కనిపించింది.

ఎవరో దుండగరులు కుక్కను చంపి దాని కాళ్లు కట్టేసి గోనె సంచిలో పెట్టి అక్కడ పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ పని ఎవరు చేశారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైనా కారణంతో కుక్క చనిపోతే.. దాని యజమానే ఇక్కడికి తెచ్చి పరేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Hyderabad: Dead dog in bag raises a stink

ఘటనపై పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ మోహన్ కుమార్ మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన వచ్చి బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశామని చెప్పారు. ఎవరైన వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మొదట భావించామని, సంచి విప్పి చూస్తే కుక్క చనిపోయి ఉందని తెలిపారు.

అయితే, కుక్క ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని చెప్పారు. కుక్క మృతదేహాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అప్పగించినట్లు తెలిపారు. కాగా, జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ కుక్క ధర సుమారు రూ. లక్షన్నరకు పైగా ఉంటుందని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+