చప్పట్లు కొట్టేందుకేనా?: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల బాధ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు మాట్లాడుతున్నప్పుడు బల్లలు చరుస్తూ అభినందనలు తెలపడం తప్ప తమకు మాట్లాడే అవకాశమే రావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు వాపోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.
చివరలో ప్రశ్నోత్తరాల సమయంలో కూడా తాము వేసిన ప్రశ్నలు రావడం లేదని, ప్రతిపక్షంలో కూర్చున్న వారికందరికీ మాట్లాడే అవకాశం వస్తున్నా, తమకు మాత్రం అవకాశాలు దక్కడం లేదని బాధపడుతున్నారని తెలుస్తోంది.

తాము ప్రభుత్వంలో ఉన్నందున ఎలాంటి ప్రశ్నలనూ అడగలేకపోతున్నామని స్వయంగా ఎమ్మెల్యేలు వాపోతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశమిస్తేనే చర్చలో పాల్గొనే అవకాశం వస్తోందని, లేకుంటే ఖాళీగా కూర్చోవాల్సిందేనని మదనపడుతున్నారట.
కొద్దిమంది మాత్రమే మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి మద్దతుగా బల్లలు చరిచేందుకు, చప్పట్లు కొట్టేందుకే తాము పరిమితమయ్యామని ఓ ఎమ్మెల్యే మీడియా ఎదుట కూడా తన గోడు వెళ్లబోసుకున్నాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications