అనుష్క దూరం: విరాట్ కోహ్లీ హార్ట్ బ్రేకింగ్(ఫొటో)

ముంబై: ప్రేమ పావురాల్లా గత కొంతకాలంగా చట్టాపెట్టాలేసుకుని తిరిగిన బాలీవుడ్ నటి అనుష్క శర్మ, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా సమాచారం. ఇందుకు విరాట్ కోహ్లీ చేసిన వివాహ ప్రతిపాదనే కారణమని కూడా తెలుస్తోంది.

విరాట్ కోహ్లీ.. ఈ ఏడాదే పెళ్లి చేసుకుందామని చెప్పగా.. అనుష్క ఇందుకు అంగీకరించలేదని సమాచారం. దీంతో అనుష్కపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లీ.. ఆమెకు దూరమయ్యాడు. అనుష్క కూడా కోహ్లీకి దూరంగానే ఉంటూ తను నటించే బాలీవుడ్ చిత్రాల్లో బిజీ అయిపోయింది.

Is Virat Kohli 'Heartbroken' After Break-Up With Anushka Sharma?

కాగా, విరాట్‌ కోహ్లి మనసు మాత్రం ఇంకా అనుష్క చుట్టూనే తిరుగుతున్నట్టుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం హృదయం ముక్కలైందంటూ కోహ్లి ఓ వ్యాఖ్య రాసి తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు.

తర్వాత ఏమైందో గానీ వెంటనే ఆ ఫొటోను తొలగించాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చే జరిగింది. దీంతో తొలగించిన ఆ ఫొటోను మళ్లీ పెట్టాడు. ‘ఆ ఫొటోను తీసేసి నేనేదో నేరానికి పాల్పడినట్లుంది. క్షమించండి. ఇదిగో మళ్లీ పెడుతున్నా' అంటూ రాసుకొచ్చాడు.

మరోవైపు శనివారం రాత్రి ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన బాలీవుడ్‌ నటుడు అంగద్‌ బేడి పుట్టినరోజు పార్టీకి హాజరైన కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘నేను ఇప్పుడు ఒంటరిని. నాతో నృత్యం చేయండి' అని పార్టీకి వచ్చిన వారితో కోహ్లి అన్నాడని తెలిసింది.

Feels like I committed a crime deleting this picture. Haha sorry guys 🙏🙏. Here it is again. 🤓👀

A photo posted by Virat Kohli (@virat.kohli) on

Read in English: English
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+