గోపిచంద్ అకాడమీ భూములపై వైఎస్ కన్ను? లాక్కుందామనుకున్నారా?
హైదరాబాద్ : మొన్న సైనా.. నేడు సింధు.. గోపిచంద్ శిష్యరికంలో ఆరితేరి ఒలింపిక్స్ లో ఇండియాకు పతకాలు అందించిన ప్రతిభాశీలులు. ఇలాంటి మెరికల్లాంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిలను తయారు చేయడానికి కోచ్ గోపిచంద్ చూపిన చొరవ విస్మరించరానిది. క్రికెట్ ఫీవర్ తో ఊగిపోయే దేశంలో బ్యాడ్మింటన్ కూ ఓ ప్రత్యేక స్థానం కల్పించేలా చేయడంలో ఆయన శ్రమ చాలానే ఉంది.
హైదరాబాద్ కేంద్రంగా అకాడమీ ప్రారంభించడానికి గోపిచంద్ చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. 2003లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గోపిచంద్ అకాడమీ కోసం గచ్చిబౌలి ప్రాంతంలో ఐదెరకాల స్థలాన్ని కేటాయించింది. స్థలంతో పాటు 25లక్షల నగదును కూడా అందజేసింది. అయితే అకాడమీ నిర్వహణకు ఆ డబ్బు అరకొరగానే మారడంతో.. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి రూ.5కోట్లను గోపిచంద్ విరాళంగా పొందారు.
ఆ విరాళంతో పాటు తన ఇంటిని కూడా అమ్మేసుకున్న గోపిచంద్.. మొత్తంగా ఆర్థిక అవాంతరాలన్నింటినీ చేధించుకుంటూ అకాడమీ ప్రారంభించారు. అయితే అకాడమీ ప్రారంభమైన రెండేళ్ల కాలానికి 2005లో వైఎస్ అధికారంలోకి రావడంతో.. ఆయన కన్ను గోపిచంద్ అకాడమీ భూముల మీద పడినట్లుగా కొన్ని ఆరోపణలున్నాయి. అప్పట్లో గచ్చిబౌలి ప్రాంతంలో భూముల రేట్లు ఆకాశాన్నంటుతుండడంతో.. అకాడమీకి కేటాయించిన ఐదెకరాల్లో మూడు ఎకరాలను కోత పెట్టాలని భావించారట వైఎస్.

ఇదే విషయంపై అకాడమీ భూముల స్వాధీనానికి అప్పట్లో ప్రభుత్వం ఓ జీవోను కూడా తీసుకొచ్చింది. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించిన గోపిచంద్.. జీవో పై 'స్టే' తెచ్చుకున్నారు. అనంతరం రోశయ్య సీఎంగా వ్యవహరించిన కాలంలోను ఆ జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా గోపిచంద్ ప్రయత్నాలు చేయగా ఆయన ప్రయత్నాలేవి సఫలం కాలేదు.
ఆ తర్వాత ఆ జీవో విషయం ఏమైందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. మరి ఇప్పటికీ.. ఆ జీవో అలానే ఉందా..? ఒకవేళ ఉంటే ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వమైనా దాన్ని ఉపసంహరించుకునే ప్రయత్నం చేస్తుందా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications