విస్తరణ: తన పేరు 'మరిచిన' అథవాలే, ఎవరితను?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామ్‌దాస్ అథవాలే మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం సమయంలో తడబడ్డారు. ఆయన తన పేరునే చదవడం మరిచిపోయారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

రాష్ట్రపతి మే (నేను) అనగానే.. తన పేరును పలకకుండానే అథవాలే ప్రమాణ పత్రాన్ని చదవడం ప్రారంభించారు. తప్పును గుర్తించిన రాష్ట్రపతి ప్రణబ్.. పేరును చదవాలని సూచించారు. ఆ తర్వాత కూాడ అథవాలే పలుమార్లు ప్రమాణ పత్రాన్ని చదవడంలో ఇబ్బందులు పడుతుంటే, ప్రణబ్ సహకరించారు. ఆయన ముందుండి చదువుతూ, కొన్ని పదాలను పలికించారు.

Modi Cabinet reshuffle 2016: Ramdas Athavale forgets to mention his name while taking oath

ఎవరీ అథవాలే

రామ్ దాస్ అథవాలే రాజ్యసభ ఎంపీ. ఇతను దళిత కమ్యూనిటీకి చెందిన వారు. అతను గతంలో లోకసభ ఎంపీగా పని చేశారు. అతను అప్పుడు మహారాష్ట్రలోని పందార్పూర్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున గెలిచారు.

1998-99 మధ్య 12వ లోకసభలో ముంబై నార్త్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. అంతకుముందు కాంగ్రెస్ - ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్నారు. 2011 నుంచి వాటికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత శివసేన - బీజేపీ కూటమిలో చేరారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కి ఇతనే చీఫ్. 2009లో షిర్డీ లోకసభ నుంచి ఓడిపోయిన అతను, 2014లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇతను పోయెట్, పెయింటర్.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ramdas Athavale forgets to mention his name while taking oath.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి