గోదావరి తెలివి తేటలొద్దు, నేనూ: నిర్మల ఆసక్తికరం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, బీజేపీ నేత నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గోదావరి జిల్లా అతి తెలివిని తన వద్ద చూపించొద్దని, నేను కూడా గోదావరి జిల్లా కోడలినేనని వ్యాఖ్యానించారని తెలుస్తోంది. పొగాకు రైతులను ఉద్దేశించి ఆమె పై వ్యాఖ్యలు చేశారట.

టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాగంటి బాబులతో కలిసి పొగాకు రైతులతో ఆమె ఇటీవల సమావేశమయ్యారు. ఆ సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. పొగాకును పండించే నిమిత్తం రైతులకు ఇచ్చిన పర్మిట్‌లను వెనక్కు ఇచ్చేయాలని ఆమె కోరారు.

Nirmala Sitaraman interesting comments on 'Godavari'

ఎకరానికి రూ.8 లక్షలను రైతులు డిమాండ్ చేశారు. అంత ఇచ్చే బడ్జెట్ తన వద్ద లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఎకరానికి అంతకన్నా ఎక్కువే ఇచ్చారని రైతులు చెప్పారని తెలుస్తోంది.

దీంతో ఆగ్రహానికి గురైన ఆమె.. ఇదే గోదావరి అతి తెలివి అని, వారు భూములను కోల్పోయారని, మీ భూములు మీ దగ్గరే ఉంటాయని, ఇలాంటి తెలివి తన వద్ద చూపొద్దని అన్నారట. వాతావరణం వేడెక్కడంతో సుజనా కల్పించుకుని కనీసం ఎకరం పర్మిట్‌కు రూ.5 లక్షల వరకన్నా ఇప్పించాలని కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union Minister Nirmala Sitaraman interesting comments on 'Godavari'.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి