'షారుక్, అమీర్ మాట్లాడేందుకు భయపడుతున్నారు'

ముంబై: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పలు అంశాల పైన మాట్లాడేందుకు బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్‌లు భయపడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. అందుకు తమ వ్యాఖ్యల పైన వ్యతిరేక స్పందన రావడమే కారణమని వ్యాఖ్యానించారు.

ఏ విషయం పైన అయినా మాట్లాడేందుకు వారిద్దరు భయపడుతున్నారని స్పష్టం చేశారు. సోనమ్ కపూర్ నటించిన 'నీరజ' చిత్రంలోని ఓ పాటను బుధవారం నాడు విడుదల చేశారు. ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

Sonam Kapoor: Shah Rukh, Aamir will be afraid to speak on issues due to negative reactions

షారూక్‌, ఆమీర్‌ లాంటి నటులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు చెబుతుంటే వాటికి వ్యతిరేక స్పందన వస్తోందన్నారు. అభిప్రాయాలు మంచివైనా చెడ్డవైనా వారికి మనం మద్దతుగా ఉండాలని సూచించారు. దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందన్నారు.

గత ఏడాది షారూక్ ఖాన్, అమీర్ ఖాన్‌లు దేశంలో అహనం పెరిగిపోతోదంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. దీని పైన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. వారిద్దరి పైన సామాజిక అనుసంధాన వేదికల్లోను దుమ్మెత్తిపోశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+