వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వింత: ఓటుకు నోటు కాదు.. ఓటుకు వయాగ్ర మాత్రలు!

|
Google Oneindia TeluguNews

సియోల్‌: ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో అధికారం కోసం డబ్బో, మద్యమో, వస్తువులో పంపిణీ చేసిన రాజకీయ నాయకులనే చూశాం. కానీ, దక్షిణ కొరియాకు చెందిన ఓ రాజకీయ నేత మాత్రం మరో అడుగు ముందుకు వేసి శృంగార సామర్థ్యాన్ని పెంపొందించే వయాగ్రా మాత్రలను పంపిణీ చేశారు.

ఆ మాత్రలు పంపిణీ చేసింది ఓ మహిళా అభ్యర్థి కావడం మరో విడ్డూరం. ఇప్పుడు ఇదే అక్కడ చర్చనీయాంశంగా మారింది. త్వరలో దక్షిణ కొరియాలో లెజిస్లేటివ్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

కాగా, ఎన్నికల్లో గెలిచేందుకు ఆమె పెద్ద సంఖ్యలో వయాగ్రా మాత్రలను తెప్పించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సువోన్‌ ప్రాంతంలో పంచిందట. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమై విచారణ ప్రారంభించారు.

South Korean men may have been given Viagra as political bribes

ఓట్ల కోసం వయాగ్రా మాత్రలు పంపిణీ చేసినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు చెప్పారు. సదరు ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

కాగా, ఓటర్లను మభ్యపెట్టడం, ఓట్లను కొనుగోలు చేయడం దక్షిణ కొరియాలో తీవ్రమైన నేరం. ఇందుకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష లేదా 10 మిలియన్ వోన్(దాదాపు రూ. 6లక్షలు) జరిమానా విధించడం జరుగుతుంది.

English summary
ELDERLY MEN IN South Korea have allegedly been given erectile dysfunction drugs to buy their votes in legislative elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X