బాంబు పేలుళ్లు: పోలీసులకు సహకరించిన దొంగలు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని చెల్సియాలో రెండు రోజుల క్రితం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసును చేధించేందుకు పోలీసులకు దొంగలు పరోక్షంగా సహకరించారు.
చెల్సియా ప్రాంతంలో అహ్మద్ ఖాన్ రహామీ రెండు బాంబులు పెట్టాడు. అందులో ఒకటి పేలింది. వెస్ట్ 23వ స్టీట్‌లో పెట్టిన బాంబు పేలింది. అయితే, అహ్మద్ ఖాన్ రహామీ పెట్టిన రెండో బాంబు పేలలేదు. ఈ రెండో బాంబును డిజబుల్ చేయడంలో ఇద్దరు దొంగల పాత్ర ఉంది.
ఈ రెండో బాంబును వెస్ట్ 27వ స్ట్రీట్‌లో పెట్టారు. ఆ దొంగలకు తెలియకుండానే ప్రెజర్ కుక్కర్ బాంబును విసిరేశారు. ఆ తర్వాత వారు సూటుకేసుతో వెళ్లారు. ఈ బాంబు నాలుగు బ్లాకులకు అవతల పడింది. ఈ ప్రెజర్ కుక్కర్ బాంబు ఫోన్‌కు అటాచ్ చేసి ఉంది.

ఆ తర్వాత విచారణ అధికారులు వచ్చి దానిని పరీక్షించారు. ఆ ఫోన్ అహ్మద్ ఖాన్ రహామీ కుటుంబ సభ్యులదిగా గుర్తించారు. ఆ తర్వాత దాని ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాన్ రహామీని గుర్తించారు. అహ్మద్ ఖాన్ న్యూజెర్సీలోను ఓ బాంబు పెట్టాడు. కాగా, న్యూజెర్సీలో జరిగిన పేలుడులో 29 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
మరో సంఘటనలో న్యూజెర్సీలోని ఎలిజబెత్ రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు పేలుడు పదార్థాలను దొంగలు గుర్తించారు. పట్టుకున్న బ్యాగులను అక్కడే పడేసిన ఆ దొంగలు, వెంటనే పోలీసులకు వారు సమాచారం అందించారు. అహ్మద్ ఖాన్ రహామీనే ఈ బాంబు పెట్టినట్లుగా భావిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications