ఒక్క కాఫీ కోసం రూ.50లక్షలు: ఇవాంకా క్రేజ్‌కి ఎగబడుతున్న పారిశ్రామికవేత్తలు

కాఫీ విత్ ఇవాంకా కోసం బడా పారిశ్రామికవేత్తలంతా ఎగబడుతున్నారు. లక్షలు పోసి మరీ ఇవాంకాతో కాఫీ తాగే అవకాశం దక్కించుకోవాలని భావిస్తున్నారు.

వాషింగ్టన్: పార్టీలకు ఫండ్స్ సేకరించాలన్నా.. ఛారిటీలకు విరాళాలు అందించాలన్నా.. ఇప్పుడు అందరిదీ ఒకే మంత్రా!. అయితే ఓ డిన్నర్ ప్లాన్ చేసి దానికో రేటు ఫిక్స్ చేయాలి, లేదంటే సింపుల్ గా ఓ కాఫీ మీట్ ఏర్పాటు చేసి.. ఎవరెంత ఎక్కువ బిడ్ చేస్తే వారికే అవకాశం అని ప్రకటించాలి.

ఇదంతా సక్సెస్ ఫుల్ గా జరగాలంటే.. దానికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలబడగలిగే మంచి ప్రాచుర్యం ఉన్న నేతనో.. సెలబ్రిటీనో ముందుపెట్టాలి. అమెరికా 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రస్తుతం ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ ఆధ్వర్యంలోని సెయింట్‌ జూడ్‌ చిల్డ్రన్స్‌ రీసెర్చ్‌ హాస్పిటల్‌ ఆఫ్‌ టెన్నెస్సీకి విరాళాలు సేకరించేందుకు చారిటీబజ్‌ అనే సంస్థ ద్వారా ఇవాంకా ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం 'కాఫీ విత్ ఇవాంకా' పేరుతో చారిటీబజ్ బిడ్ ప్రారంభించింది.

Trump Family Tried To Auction Coffee With Ivanka

అయితే ఈ అవకాశాన్ని తమ వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు కాఫీ విత్ ఇవాంకా కోసం క్యూ కడుతున్నారు. దీంతో పోటాపోటీగా బిడ్ లు దాఖలయ్యాయి. ఇందులో అత్యధికంగా రూ.40లక్షలకు లండన్ కు చెందిన బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్ ఓజాన్ ఒజుర్కల్ బిడ్ దాఖలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

అంత మొత్తంలో బిడ్ దాఖలు చేయడానికి కారణం.. భవిష్యత్తులో తన వ్యాపార ఒప్పందాలు సాఫీగా సాగిపోయేందుకు ఇవాంకాతో పరిచయం ఉపయోగపడుతుందని ఓజాన్ ఒజుర్కల్ అభిప్రాయపడుతున్నాడు.

ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన రెస్టారెంట్‌ చైన్‌ టెక్స్‌-మెక్స్‌ అధినేత రస్సెల్‌ వైబర్రా రూ.46 లక్షలు బిడ్‌ వేశారు. కాఫీ విత్ ఇవాంకా కోసం రూ.50లక్షలు వెచ్చించడానికైనా తాను సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు. ఇందులో గనుక తనకు అవకాశం దక్కితే ఇమిగ్రేషన్ పాలసీకి సంబంధించి ట్రంప్ కు తన ప్రతిపాదనలు తెలియజేస్తానని చెబుతున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+