బీజేపీ మహిళా నేతకు అందరి ముందు ఐ లవ్యూ చెప్పాడు
చెన్నై: తమిళనాడులో భారతీయ జనతా పార్టీ మహిళా ఎమ్మెల్యే పట్ల ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. సదరు మహిళా ఎమ్మెల్యేకు అందరి ఎదుట ఐ లవ్యూ చెప్పాడు. దీంతో బీజేపీ కార్యకర్తలను ఆయనను చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం జరిగింది.
తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శి వానతి శ్రీనివాసన్. ఈమే బాగా మాట్లాడుతారు. అందరితోను చొరవగా ఉంటారు. అలాంటి వానతి శ్రీనివాసన్‌కు పాతికేళ్ల వయస్సు వ్యక్తి ఐ లవ్యూ చెప్పారు.

శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు కోవైలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వానతి శ్రీనివాసన్ అతిథిగా వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పలువురు కార్యకర్తలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. సెల్ఫీలు కూడా దిగారు.
వారితో పాటు వచ్చిన తంజావూరుకు చెందిన ముత్తవేల్ అనే యువకుడు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అలా చెయ్యి వదలకుండా పట్టుకున్నాడు. అంతేకాకుండా, ఐ లవ్యూ అని చెప్పాడు. దీంతో ఆమె ఖంగు తిన్నారు. చుట్టూ ఉన్న బిజెపి కార్యకర్తలు అతనిని పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications