ట్రంప్ కొత్త చట్టం: ‘దగ్గరి సంబంధం’ ఉంటేనే అమెరికాకు, గ్రాండ్ పేరెంట్స్ కు నో చాన్స్

అమెరికాకు ఆరు ముస్లిం దేశాల ప్రవేశాన్ని కష్టతరం చేస్తూ, విధించిన నిషేధాన్ని మరింత కటువుగా అమలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి అక్కడి న్యాయస్థానం దన్ను కూడా లభించింది.

వాషింగ్టన్‌ : అమెరికాకు ఆరు ముస్లిం దేశాల ప్రవేశాన్ని కష్టతరం చేస్తూ, విధించిన నిషేధాన్ని మరింత కటువుగా అమలు చేసేందుకు డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నిర్ణయానికి అక్కడి న్యాయస్థానం దన్ను కూడా లభించింది.

ఈ నేపథ్యంలో, ఆ దేశాలకు సంబంధించి.. వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం మరింతగా బిగించేసింది. సాధారణంగా కుటుంబం అంటే.. అమ్మానాన్న, కొడుకు, కూతురు, తాత, అమ్మమ్మ, మనవడు, మనవరాలు.

అయితే, ఇప్పుడు సవరిస్తున్న వీసా ప్రమాణాల ప్రకారం, తాతయ్య అమ్మమ్మలను సొంత కుటుంబ సభ్యులుగా పరిగణించరు. అమెరికాలోని తమవారి వద్దకు వెళ్లడానికి వారికి వీసా లభించదు.

Donald Trump: US visa applicants require 'close' family ties under revised travel ban

ఇప్పుడు అమెరికాలో ఉన్న వారి దగ్గరికి ఎవరైనా వెళ్లాలంటే.. వారితో తమకున్న బంధాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. ఆరు ముస్లిం దేశాలతోపాటు, అమెరికాలో ఆశ్రయం కోరుకునే శరణార్థులకు ఈ కొత్త నిబంధనని విధించారు.

ఇకమీదట దగ్గర.. దూరపు బంధాలుగా వేటిని పరిగణిస్తారనేది ఒక జాబితాను రూపొందించారు. అమెరికాలో ఉండేవారికి తాత- అమ్మమ్మ, మనవడు-మనవరాలు, అత్తయ్య- మామయ్య, మేనకోడలు- మేనల్లుడు, వదిన-బావ, త్వరలో పెళ్లాడబోయే యువతీ యువకుడు.. ఇలా వరుసయ్యే వారిని దగ్గరి బంధువులుగా పరిగణించరు.

అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ కొత్త చట్టంతో అమెరికాలో ఉంటూ కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారు.. తమకు కాబోయే జీవిత భాగస్వామిని పెళ్లికి ముందే అమెరికాకు రప్పించుకోవడం ఇకమీదట కుదరదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+