వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీవిని ఎరుగని డైట్: ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.. కేవలం 'గాలి' పీలుస్తూ..

పెళ్లి తర్వాత మూడేళ్ల పాటు దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈ జంట.. ఆ పర్యటన నుంచే 'గాలి' డైట్ ను అలవాటు చేసుకుంది.

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: ఆరోగ్యంగా ఉండటమెలా? అన్న ప్రశ్నకు ఒక్కొక్కరి నుంచి ఒక్కో సమాధానం వినిపిస్తుంది. ఇదే ప్రశ్నను గూగుల్ లో వెతికితే లెక్కలేనన్ని సమాధానాలు దొరుకుతాయి. ఎవరికి అనువైన పద్దతిని వారు ఎంచుకుంటారు. ముఖ్యంగా డైట్ విషయంలో.. ఎలాంటి పద్దతులు పాటించాలనే దాని పట్ల చాలామందిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ జంట డైట్ విషయంలో అందరికీ భిన్నంగా వ్యవహరిస్తోంది. కేవలం వారానికి మూడు సార్లు మాత్రమే ఆహారం తీసుకునే ఈ జంట.. మిగతా మూడు రోజులు కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటోంది. ఇలాంటి డైట్ వల్ల మనిషి బలహీనమైపోడా? అన్న సందేహాలు కలగవచ్చు. కానీ ఈ దంపతులు మాత్రం పూర్తి ఆరోగ్యకరంగా ఉండటం ఇతరులను కూడా ఈ డైట్ వైపు ఆకర్షితులను చేసేదిగా మారింది.

Akahi recardo

అమెరికాకు చెందిన అకహి(36), రికార్డొ(34), కమిలా కస్టెల్లొ అనే భార్య భర్తలు కొన్నేళ్ల నుంచి ఇదే పద్దతిని అనుసరిస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసముండే వీరికి 2005లొ వివాహమైంది. పెళ్లి తర్వాత మూడేళ్ల పాటు దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈ జంట.. ఆ పర్యటన నుంచే 'గాలి' డైట్ ను అలవాటు చేసుకుంది.

ఎలాంటి ఆహారం లేకుండా కేవలం గాలిని పీల్చి బతకవచ్చునని ఓ స్నేహితుడి ద్వారా తెలుసుకున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా ఈ డైట్ ను పాటించారు. ఇందులో భాగంగా.. 21రోజుల డైట్ ప్లాన్ సిద్దం చేసుకున్నారు. తొలి ఏడు రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కేవలం గాలినే పీల్చారు. ఆ తర్వాత రెండు వారాలు కొద్దిగా నీళ్లు.. పండ్ల రసాలను తీసుకున్నారు. ఈ ప్రయోగం సఫలం కావడంతో.. ఇక అప్పటినుంచే ఇదే పద్దతిని పాటిస్తూ వస్తున్నారు.

ఈ డైట్ ప్లాన్ పాటిస్తున్న క్రమంలోనే కమిలా గర్భం దాల్చింది. గర్భవతి అయ్యాక కూడా ఆమె తన డైట్ ప్లాన్ ను అలాగే కొనసాగించడం గమనార్హం. తనకు పుట్టిన బిడ్డ కూడా పూర్తి ఆరోగ్యంగా పుట్టడం విశేషం. గర్భవతిగా ఉన్న సమయంలో తొమ్మిది నెలలపాటు గాలితో పాటు వారానికి ఐదుసార్లు.. అవి కూడా ద్రవ పదార్థాలనే తీసుకున్నట్లు కమిలా చెబుతోంది.

ఆహారం విషయంలో ఇంత నియంతృత్వ అవసరమా? అని కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ అకహి రికార్డొ, కమిలా కస్టెల్లొ జంట మాత్రం ఇలాంటి జీవన శైలి తమకు సరిగ్గా సరిపోయిందంటున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు. తమ అభిప్రాయాలను వారిపై రుద్దబోమని, పిల్లలు ఎలాంటి ఆహారం కోరుకుంటే.. అలాంటి ఆహారం అందిస్తామని అంటున్నారు. ఇప్పటికీ వారానికి కేవలం మూడు నుంచి నాలుగుసార్లు మాత్రమే ఆహారం తిసుకుంటూ.. కేవలం గాలిని పీలుస్తూ బతుకుతోంది ఈ జంట.

English summary
A husband and wife live a 'food-free' diet and claim they survive by only eating vegetable broth or fruit a handful of times a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X