చంద్రబాబు సాక్షిగా టిటిడిలో విభేదాలు: పోటీపడ్డ అర్చకులు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షిగా అర్చకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రికి తలపాగా కట్టేందుకు కంకణదారుడు వేణుగోపాల్ దీక్షితులు వస్త్రాన్ని తీసుకున్నారు.
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాక్షిగా అర్చకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రికి తలపాగా కట్టేందుకు కంకణదారుడు వేణుగోపాల్ దీక్షితులు వస్త్రాన్ని తీసుకున్నారు.
వేణుగోపాల్ స్వామి దగ్గర నుంచి రమణదీక్షితులు తీసుకున్నారు. రమణదీక్షితులు రెండుసార్లు లాక్కోవడంతో వేణుగోపాల్ స్వామి వస్త్రాన్ని వదిలేశారు. చివరకు రమణ దీక్షితులు ముఖ్యమంత్రికి తలపాగా కట్టారు.

మఖ్యమంత్రి చంద్రబాబుకు పరివట్టం కట్టేందుకు వీరు పోటీ పడడం విమర్శలకు తావిచ్చింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.

అంతకుముందు చంద్రబాబు వేది ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు. హారతి ఇచ్చిన తర్వాత అఖిలాండ వద్ద ఏర్పాటు చేసిన సీట్లో ఆయన కూర్చున్నారు. అనంతరం ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు మడిచి ఉన్న వస్త్రాన్ని విప్పి ముఖ్యమంత్రి తలకు చుట్టేందుకు కుడివైపు నుంచి ముందుకు వచ్చారు.
సీఎంకు ఎడమవైపున ఉన్న మరో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు తనకు ఇవ్వమని అడిగారు. ఆయన ఇవ్వలేదు. రమణ దీక్షితులు బలవంతంగా వస్త్రాన్ని పట్టుకోవడంతో వేణుగోపాల్ దీక్షితులు ఆయనకు ఇచ్చేసి పక్కకు వచ్చేశారు.

అనంతరం రమణ దీక్షితులు, డాలర్ శేశాద్రి, సీఎం చంద్రబాబు తలపాగా చుట్టారు. ఈ వ్యవహారం అర్చక వర్గాల్లో చర్చనీయాంశమైంది. సీఎంకు పరివట్టం కట్టడానికి పోటీ పడడంపై విమర్శలు వస్తున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఇలా వ్యవహరించడం ఏమిటని ఆరోపణలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications