బల్లికి రూ.20కోట్లా?: అక్రమంగా తరలిస్తుంటే పోలీసులు పట్టేసుకున్నారు..

Subscribe to Oneindia Telugu

గువాహటి: సాధారణంగా బల్లుల్ని చూస్తేనే చాలామంది జడుసుకుంటారు. అదే బల్లి కోట్ల రూపాయల విలువ చేసేదైతే!.. బల్లి కోట్ల రూపాయల విలువ చేయడమేంటని కొట్టిపారేయవచ్చు. కానీ నిజంగానే కోట్ల రూపాయల విలువ చేసే ఓ అరుదైన బల్లిని పోలీసులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఆ బల్లిని అక్రమంగా తరలిస్తున్న నిందితున్ని అరెస్టు చేశారు.

కోట్ల రూపాయల విలువ చేసే బంగారు బల్లిని ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్నట్లు గువహటి పోలీసులకు సమాచారం అందింది. రైల్వే స్టేషన్ లో అతని కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో ప్రయాణికులు వారికి సమాచారం అందించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. రైల్వే స్టేషన్ లో చాకచక్యంగా వ్యవహరించి అతని లగేజీని పరిశీలించారు.

Police seizes rare golden lizard worth Rs 20 crore at Guwahati railway station

దీంతో అతని లగేజీలో అరుదైన జాతి బంగారు బల్లి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.20కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిందితుడి బల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అతడికి ఏవైనా ముఠాలతో సంబంధాలున్నాయా? ఇతర జీవులను సైతం అక్రమ రవాణా చేస్తున్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బల్లికి రూ.20కోట్లు అని తెలియగానే అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ తినడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a rare incident, Police officials has seized a rare golden lizard with a worth of Rs 20 crore approximately from a person at Guwahati railway station.
Please Wait while comments are loading...