చీరల దెబ్బ: దిగొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం! 'మేం చేసేవాళ్లంగా'

Posted By:
Subscribe to Oneindia Telugu
  Kcr Over Bathukamma Sarees issue చీరల షాక్: కేసీఆర్ ఆరా, తండ్రికి సర్దిచెప్పిన కేటీఆర్ | Oneindia

  హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు వివాదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, చేనేత - జౌళీ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌లు స్పందించారు.

  పరువు తీసిన చీరల ఇష్యూపై కేసీఆర్ ఆరా: రోడ్డుపై కొట్టుకున్న మహిళలు

  ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చీరలు నాణ్యమైనవేనని అధికారులు చెప్పారు. వాటిని పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేశామన్నారు. చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం జూన్ నెలలో నిర్ణయించిందన్నారు.

  అందుకే సూరత్ నుంచి

  అందుకే సూరత్ నుంచి

  మరమగ్గాల పరిశ్రమ పెద్ద ఎత్తున ఉన్న సిరిసిల్లలో తయారు చేయించామని, 1.04 కోట్ల మంది లబ్ధిదారులకు చీరలను చేనేతపై తయారు చేయించాలంటే మూడేళ్లు పడుతుందని వారు తెలిపారు. అందుకే టెండర్ ప్రక్రియ సూరత్ నుంచి కొనుగోలు చేశామన్నారు.

  ఎక్కడ ఏ ధర అంటే..

  ఎక్కడ ఏ ధర అంటే..

  3.7 కోట్ల మీటర్ల వస్త్రంతో 58 లక్షల చీరలను సిరిసిల్ల మగ్గాల నుంచి సేకరించామని, 2.3 కోట్ల మీటర్ల వస్త్రంతో చీరలను సూరత్‌ నుంచి కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. సిరిసిల్ల చీరధర రూ.224, సూరత్‌ నుంచి కొనుగోలు చేసిన చీర ధర రూ.200గా ఉందన్నారు.

  వచ్చే ఏడాది రాష్ట్రంలోనే

  వచ్చే ఏడాది రాష్ట్రంలోనే

  నాలుగు దశల్లో చీరల నాణ్యతను పరిశీలించామని, లోపాలు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. సూరత్‌లో ట్విస్టెడ్‌ పాలియెస్టర్‌తో చీరలు తయారు చేశారని, సిరిసిల్లలో ఫిలమెంట్‌ యార్న్‌తో తయారు చేశారని తెలిపారు. ఈ నెల 20 వరకే పంపిణీ చేయాలని నిర్ణయించామని, పంపిణీ పూర్తి కాని చోట మరో మూడు, నాలుగు రోజుల వరకు పంపిణీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. వచ్చే ఏడాది బతుకమ్మ చీరలను పూర్తిగా రాష్ట్రంలోనే తయారు చేయిస్తామన్నారు. తాజా నిరసన నేపథ్యంలో దిగొచ్చి.. వచ్చే ఏడాది రాష్ట్రంలోనే తయారు చేయిస్తామని చెప్పడం గమనార్హం.

  ఇదీ చేనేత కార్మికల వాదన

  ఇదీ చేనేత కార్మికల వాదన

  కేసీఆర్ ప్రభుత్వం ఈ చీరల విషయంలో ముందు జాగ్రత్తగా ఉంటే వివాదం కాకపోయేదని అంటున్నారు. చీరలు మొత్తం ఇక్కడి వారితోనే తయారు చేయిస్తే మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించినట్లుగా ఉండేదని అంటున్నారు. దీనిని కూడా పలువురు చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

  మేం నేసేవాళ్లం

  మేం నేసేవాళ్లం

  తమకు చెబితే, అంత పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ తాము మరమగ్గాల మీద నేసేవాళ్లమని చేనేత కార్మికులు అంటున్నారు. దీంతో తమకు ఉపాధి దొరికేదని చెబుతున్నారు. తద్వారా తమకు ప్రభుత్వం చేసిన సాయంతో గిట్టుబాటు కూడా అయినట్లుగా ఉండేదని చెబుతున్నారు.

  కేసీఆర్ ప్రభుత్వం మరో పొరపాటు

  కేసీఆర్ ప్రభుత్వం మరో పొరపాటు

  ఇదిలా ఉండగా, చీరలు కాల్చివేసిన వారిలో 18 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. బతుకమ్మ చీరలను నిరసిస్తూ ఎవరు నిరసన తెలిపినప్పటికీ.. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న మరో పొరపాటు అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A Telangana government scheme to distribute sarees as gifts among 1.5 lakh women below poverty line for the local Bathukamma festival backfired on Monday, with the women complaining about the quality of the garments.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి