వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పులి బోనులోకి వెళ్ళింది, మాంసం వేసినా ప్రాణాలు దక్కలేదు

ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని ఓ జూపార్క్ లోని విషాదకర ఘటన చోటుచేసుకొంది. ఓ మహిళా ఉద్యోగి బోనులో ఉన్న సమయంలోనే బోనులోకి పులి వచ్చింది. ఆమెపై దాడి చేసి చంపేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

షాక్: పులి బోనులోకి వెళ్ళింది, మాంసం వేసినా ప్రాణాలు దక్కలేదు
లండన్: ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని ఓ జూపార్క్ లోని విషాదకర ఘటన చోటుచేసుకొంది. ఓ మహిళా ఉద్యోగి బోనులో ఉన్న సమయంలోనే బోనులోకి పులి వచ్చింది. ఆమెపై దాడి చేసి చంపేసింది.

కేంబ్రిడ్జిషైర్ లోని హమమర్టన్ జూపార్క్ లో సోమవారం నాడు ఉదయం 11.45 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకొంది. 33 ఏళ్ళ మహిళా జూ కీపర్ రోజా కింగ్ ప్రాణాలను కోల్పోయింది.

రోజా కింగ్ బోనులో ఉండగానే అదే సమయంలో పులి బోనులోకి వచ్చింది. ఆమె ప్రాణాలు కాపాడేందుకు సహచర సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. పులికి మాంసం ముక్కలు విసిరి దాని దృష్టిని మర్చేందుకు యత్నించారు.

Woman Zookeeper Dies After Tiger Enters Enclosure In 'Freak Accident' In UK

అయినా పులి ఏ మాత్రం తగ్గకుండా రోజాకింగ్ పై దాడిచేసింది. దీంతో ఆమె కేకలతో జూపార్క్ దద్దరిల్లింది.జూపార్క్ లోని వందమంది సందర్శకులను వెంటనే బయటకు పంపేశారు.

సహచ సిబ్బంది కళ్ళముందే రోజాకింగ్ పై పులి దాడిచేసిందని ప్రత్యక్షసాక్షి పీట్ డేవిస్ తెలిపారు.అప్పుడు విన్పించిన కేకలు ఆమెవే అనడంలో సందేహం లేదన్నారు. ఆమె కేకలతో ఏదో భయంకరమైన ఘటన సంభవించిందని భావించాం. పులి ఆమెపై దాడిచేసినట్టు కన్పించింది. ఆ సమయంలో జూల్ ఉన్న డేవిస్ చెప్పారు.

పులి లేదని రోజాకింగ్ బోనులోకి ప్రవేశించిందని ఆ వెంటనే తోటి సిబ్బంది కేకలు వేయడంతో ఆమె తేరుకొందన్నారు.అయితే అంతలోనే పులి ఆమెపై విరుచుకుపడిందన్నారు. రోజాకింగ్ కు జంతువులంటే ఎంతో ప్రాణమన్నారు. ఆమె జంతువులను ఎంతో ప్రేమగా చూసుకొనేదని చెప్పారు. ఇది అసాధరణ ఘటన అని జూ నిర్వాహకులు చెప్పారు. ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

English summary
A female zookeeper died Monday after a tiger entered the enclosure where she was working in southeast England, with the zoo calling it a "freak accident".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X