వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదాపై అది నిజమేనా: చంద్రబాబు టార్గెట్?

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ తీయాలనే లక్ష్యంతోనే బిజెపి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Recommended Video

TDP MLA Gets Head Tonsured, Unhappy Over Funds Allocated to AP

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపడమే కాకుండా ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం వెనక బిజెపి రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు.

తమకు నచ్చితే చాలు...

తమకు నచ్చితే చాలు...

తమకు నచ్చితే, రాజకీంగా తమకు అవసరమైతే తప్ప ఏ రాష్ట్రానికి కూడా కేంద్రం ఉదారంగా సహాయం చేయడానికి తాజా పరిమాణాన్ని బట్టి అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అదే జరిగిందని అంటున్నారు. చంద్రబాబును దెబ్బ తీసి రాష్ట్రంలో పాగా వేయాలనే రాజకీయ వ్యూహంలో భాగంగానే కేంద్రం వ్యవహరించిందని అంటున్నారు.

హిమాచల్ ప్రదేశ్ విషయంలో ఇలా...

హిమాచల్ ప్రదేశ్ విషయంలో ఇలా...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ర.16 వేల కోట్ల లోటు ఉందని కాగ్ నిర్ధారింంచింది. అయితే, దాన్ని భర్తీ చేయడానికి కేంద్రం సాకులు చూపుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం రెవెన్యూ లోటు కింద ఏటా రూ.8 వేల కోట్లు ఇస్తోంది. అంత చిన్న రాష్ట్రానికి ఇప్పటికే మూడు త్రైమాసికాల్లో విడతలవారీగా నిధులు విడుదల చేశారు.

ఎన్నికలకు ముందు...

ఎన్నికలకు ముందు...

హిమాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల ముందు కేంద్రం చెల్లింపులు జరిపింది. ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే ప్రయోజానాలు అన్నింటినీ ఆ రాష్ట్రానికి కల్పిస్తోంది. ఎపికి మాత్రం మొండిచేయి చూపుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేం కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి దానికి కూడా కొర్రీలు పెడుతూ వస్తోంది.

ఆర్థిక సంఘం ఇలా చెప్పింది..

ఆర్థిక సంఘం ఇలా చెప్పింది..

తన నివేదికలో 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలను, ఇతర రాష్ట్రానలు ఒకే విధంగా పరిగణిస్తూ సిఫార్సులు చేసింది. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులు, ఆర్థిక సామర్థ్యం అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్లు చెప్పింది.

అది సాకు మాత్రమేనా...

అది సాకు మాత్రమేనా...


ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వకూడదని ఆర్థిక సంఘం చెప్పలేదని తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రాలకు హోదా ఇవ్వవచ్చునని, దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చునని సంఘం సభ్యులు పలుమార్లు చెప్పారు. అయితే దాన్ని పట్టించుకోకుండా ఆర్థిక సంఘం వద్దని చెప్పిందంటూ కేంద్రం సాకులు చెబుతోంది.

రెవెన్యూ లోటుపై మాత్రం

రెవెన్యూ లోటుపై మాత్రం

ఆర్థిక సంఘం ఆంద్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుపై చేసిన సిఫార్సును మాత్రం కేంద్రం పట్టించుకోవడం లేదు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2019 - 2020 ఆర్థిక సంవత్సరం నాటికి రెవెన్యూ లోటు కొనసాగుతుందని ఆర్థిక సంఘం చెప్పింది. 2015 -16 నుంచి ఐదేళ్ల పాటు రెవెన్యూ లోటు భర్తీకి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కూడా చెప్పింది. కానీ కేంద్రం పట్టించుకోవడం లేదు. మొత్తం 11 రాష్ట్రాలను ప్రత్యేక హోదాను కొనసాగిస్తూ ప్రయోజనాలు కల్పిస్తోంది.

English summary
PM Narendra Modi's union government is in a bid to make Andhra Pradesh CM and Telugu Desam Party chief Nara Chandrababu Naidu weak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X